Varudu Kaavalenu : రివ్యూ

నాగశౌర్య, రీతు వర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వచ్చిన ‘వరుడు కావలెను’ రివ్యూ..

Varudu Kaavalenu : రివ్యూ

Varudu Kaavalenu

Varudu Kaavalenu: యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యంగ్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘వరుడు కావలెను’. పాటలు, ప్రోమోలు మూవీ మీద అంచనాలు పెంచేశాయి. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

RRR Movie : ఆరోజు ఏం చెప్పబోతున్నారబ్బా?

కథ..
భూమి అలియాస్ భూమిక (రీతు వర్మ) సొంతగా ఎకో ఫ్రెండ్లీకి సంబంధించిన బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఆమెకు పెళ్లి చెయ్యాలని తల్లి ప్రభావతి (నదియా) రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. భూమి క్యారెక్టర్ ఎవరికీ అర్థంకానంత డిఫరెంట్‌గా అనిపిస్తుంటుంది. కోపం ఎక్కువ, ఆఫీసులో ఎంప్లాయిస్‌తో సహా కస్టమర్ల మీద కూడా విరుచుకు పడుతుంటుంది.
అచ్చ తెలుగు వాతావరణాన్ని మిస్ అవుతున్నానని ప్యారిస్ నుండి ఇండియాకి వస్తాడు పాపులర్ ఆర్కిటెక్చర్ ఆకాష్ (నాగ శౌర్య). ఫ్రెండ్ ఫాదర్ జయప్రకాష్‌ని కలవడానికి వెళ్లినప్పుడు అక్కడ భూమిని చూస్తాడు ఆకాష్. జెపి కోరిక మేరకు భూమి కంపెనీకి ఒక డిజైన్ చేసి ఆమె ఇంప్రెషన్ పొందుతాడు ఆకాష్. క్రమంగా భూమి అతనితో ప్రేమలో పడుతుంది.

Varudu Kaavalenu : ‘ఆ అందం.. ఆ పొగరు.. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది’..

కట్ చేస్తే వీళ్లిద్దరికీ అంతకుముందే పరిచయం ఉంటుంది. ఈ ప్రేమ కథ ఇలా కొనసాగుతుండగా తల్లితో నేనొక అబ్బాయిని ప్రేమించానని అతణ్ణే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆకాష్‌కి తన మనసులో మాట చెప్పడానికి వెళ్తుంది భూమి. ఆకాష్ మాటల్లో తనంటే ఇష్టం లేదని తెలుసుకుని, రిజెక్ట్ చేసి వచ్చేస్తుంది. అసలు వీళ్ల మధ్య ఏం జరిగింది.. చివరికి భూమి – ఆకాష్ ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా కథ..

Folk Songs : ‘సారంగ దరియా’ నుండి ‘దిగు దిగు దిగు నాగ’ వరకు ఊపు ఊపుతున్న ఫోక్ సాంగ్స్..

నటీనటులు..
భూమి క్యారెక్టర్‌లో రీతు వర్మ ఒదిగిపోయింది. ఆ రోల్ తనకోసమే క్రియేట్ చెయ్యబడింది అన్నంత బాగా నటించి మెప్పించింది. సినిమాలో చాలా వరకు శారీలో బ్యూటిఫుల్‌గా కనిపించింది. లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో రీతు పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక నాగ శౌర్య కూడా తన క్యారెక్టర్‌కి కంప్లీట్‌గా న్యాయం చేసాడు. మిగతా నటీనటుల క్యారెక్టర్లన్నీ కూడా అలరిస్తాయి.

Varudu Kaavalenu : ‘పొగరుబోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే’..

టెక్నీషియన్స్..
ఫస్ట్ సినిమాగా ఓ ఫీల్ గుడ్ కథను రాసుకుని, దాన్ని అంతే చక్కగా తెరకెక్కించడంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కాస్త బోరింగ్‌గా అనిపించినప్పటికీ తర్వాత కథలో వేగం పెంచి ఆకట్టుకునేలా మలిచారు. సినిమాకి పెద్ద ప్లస్ డైలాగ్స్. గణేష్ కుమార్ రావూరి అద్భుతమైన మాటలు రాశారు. లవ్, సెంటిమెండ్, కామెడీ ఇలా ప్రతి సందర్భంలోనూ ఆయన రాసిన మాటలు ఆకట్టుకుంటాయి. వంశీ పచ్చిపులుసు విజువల్స్, విశాల్ చంద్రశేఖర్ సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

Malli Modalaindi : వర్షిణితో సుమంత్ విడాకులు!

ఓవరాల్‌గా..
కంప్లీట్ క్లీన్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడే వారిని ‘వరుడు కావలెను’ తప్పకుండా ఆకట్టుకుంటుంది..