Varudu Kavalenu : ఊళ్ళో పెళ్ళిళ్ళని సినిమా ప్రమోషన్ల కోసం వాడిన నాగశౌర్య

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో తెలుసుకొని వాటిల్లో కొన్ని పెళ్ళిళ్ళకి గెస్టులుగా వెళ్లారు. హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ ఇద్దరూ

10TV Telugu News

Varudu Kavalenu :  యువ హీరో నాగశౌర్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘వరుడు కావలెను’. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సంగీత్ అంటూ కొత్తగా ప్రమోషన్ చేశారు. ఈ సంగీత్ ఈవెంట్ కి పూజ హెగ్డే ని చీఫ్ గెస్ట్ గా పిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్లు కొత్తగా చేస్తుంది. ముందుగా ఈ సినిమాను అక్టోబర్ 15వ తేదీన దసరా సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు కానీ అదే రోజున మరో రెండు సినిమాలు రిలీజ్ అవ్వడంతో అక్టోబర్ 29న విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. సినిమా రిలీజ్ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. వేగంతో పాటు వినూత్నతని కూడా పెంచారు.

Samantha : మరోసారి సమంత కేసుని విచారించిన కోర్టు.. తీర్పు??

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో తెలుసుకొని వాటిల్లో కొన్ని పెళ్ళిళ్ళకి గెస్టులుగా వెళ్లారు. హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో జరిగిన కొన్ని పెళ్లి వేడుకలకి అతిధులుగా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ పెళ్లి వేడుకలలో సందడి చేశారు. నూతన జంటలని జంటగా ఆశీర్వదించారు కూడా. ఇలా ఊళ్ళో జరుగుతున్న పెళ్ళిళ్ళని తన సినిమా ప్రమోషన్ల కోసం నాగశౌర్య వాడుకోవడంతో సోషల్ మీడియాలో ఈ విషయంతో పాటు వాటికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Pushpa : ‘సామి సామి’ అంటూ రష్మికతో మాస్ సాంగ్ పాడించిన పుష్ప రాజ్.. పాట రిలీజ్ ఆ రోజే

కొంతమంది తమ సినిమా ప్రమోషన్ కోసం పెళ్లిని కూడా వదలడం లేదు కదా అని కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది ఇదంతా ముందే సెట్ చేసి మాట్లాడి పెట్టి ఉంటారు. టైంకి వీళ్ళు సడెన్ గా వెళ్లినట్టు ప్రమోషన్ చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇలా పెళ్ళిళ్ళకి వెళ్లి ప్రమోషన్లు చేయడం కొత్తగానూ వింతగానూ ఉంది అంటున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూడాలి.