Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున.. జేమ్స్ బాండ్ తరహాలో వరుణ్ తేజ్ కొత్త సినిమా..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఇవాళ వరుణ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో ఈ రెండు చిత్రాలను నుంచి పోస్టర్స్ అండ్ అప్డేట్స్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుణ్ 12వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. విడుదలైన ఈ మోషన్ పోస్టర్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తుంది.

Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున.. జేమ్స్ బాండ్ తరహాలో వరుణ్ తేజ్ కొత్త సినిమా..

Gandeevadhari Arjuna

Gandeevadhari Arjuna : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఇవాళ వరుణ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో ఈ రెండు చిత్రాలను నుంచి పోస్టర్స్ అండ్ అప్డేట్స్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుణ్ 12వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. విడుదలైన ఈ మోషన్ పోస్టర్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తుంది.

Varun Tej: దీపావళి పండుగ నాడు గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో వరుణ్ తేజ్..

ఈ సినిమాలో వరుణ్ జేమ్స్ బాండ్ తరహా పాత్ర పోషించబోతున్నట్లు అర్ధమవుతుంది. మోషన్ పోస్టర్ విజువల్స్ చూస్తుంటే లండన్ బ్యాక్ గ్రౌండ్ లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ చేతిలో గన్ పట్టుకొని అగ్రెసివ్ ఇంటెన్సిటీతో ఇంతకు ముందు చూడని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే సినిమా టైటిల్ ని కూడా వైవిధ్యంగా పెట్టారు. ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్ తో అందరిలో ఆసక్తిని కలగజేశారు.

ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ కి మిక్కీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ మరియు ఇతర నటీనటులు గురించి చిత్ర యూనిట్ ఇంకా ఎటువంటి వివరాలు తెలియజేయలేదు. త్వరలోనే ఈ వివరాలను అధికారిగా ప్రకటించనున్నారు.

కాగా వరుణ్ తేజ్ కెరీర్ లో వస్తున్న ఫస్ట్ కమర్షియల్ మూవీ ‘గాండీవధారి అర్జున’. ఘోస్ట్ లాంటి పరాజయం తరువాత దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చేస్తున్న ఈ మూవీతో వరుణ్ కి కమర్షియల్ హిట్టుని అందిస్తాడా అనేది చూడాలి. ఈ సినిమా తరువాత వరుణ్.. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడా డైరెక్షన్ లో తన 13వ సినిమాని చేస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నాడు. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.