Varun Tej : సినిమా హిట్ అవ్వడానికి నటీనటులతో సంబంధం లేదు.. ఆ సినిమాలు అలాగే హిట్ అయ్యాయి..

తాజాగా వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంతార గురించి టాపిక్ రావడంతో సినిమా విజయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.....................

Varun Tej : సినిమా హిట్ అవ్వడానికి నటీనటులతో సంబంధం లేదు.. ఆ సినిమాలు అలాగే హిట్ అయ్యాయి..

Varun Tej comments on Hit cinemas

Varun Tej :   యువ మెగా హీరో వరుణ్ తేజ్ మొదటి నుంచి కూడా కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తున్నాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి చూస్తున్నాడు. వరుణ్ తేజ్ గత సినిమా గని బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సారి గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని రెండు సూపర్ స్టోరీలతో రెడీ అయ్యాడు.

ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు జరుపుకున్నారు. వరుణ్ బర్త్ డే సందర్భంగా తన నెక్స్ట్ సినిమా టైటిల్ గాండీవధారి అర్జున అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టి మోషన్ పోస్టర్ తో మరింత ఆసక్తి కలిగించారు సినిమాపై. ఇక ఆ తర్వాతి సినిమా కూడా యుద్ధ విమానాలు, సోల్జర్ నేపథ్యంలో రాబోతుంది. ఈ రెండు సినిమాలు ఆసక్తి నెలకొల్పడంతో మంచి విజయం సాధిస్తాయని అభిమానులు వీటి కోసం ఎదురు చూస్తున్నారు.

Rakul Preet Singh : పాన్ ఇండియా అనే పదం ఒక కమర్షియల్ కోణం మాత్రమే..

తాజాగా వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంతార గురించి టాపిక్ రావడంతో సినిమా విజయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. కాంతార సినిమా విజయం నన్ను ఆశ్చర్యపరిచింది. ఒక సినిమా విజయం ఆ సినిమాలో ఎమోషన్ ఎలా నడుస్తుంది, మనం దానికి ఎంత బాగా కనెక్ట్ అయ్యాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది అని నేను అనుకుంటాను. సినిమా విజయానికి నటీనటులు ఎవరు అనేది ముఖ్యం కాదు. వేరే ఏవి కూడా విజయానికి కారణాలు అయినా ఆ సినిమా ఎంతగా కనెక్ట్ అయింది అనేదే ముఖ్యం. ప్రజలతో ఆ సినిమా మమేకమవ్వాలి. పుష్ప, కాంతార, RRR సినిమాల విషయంలో ఇదే జరిగింది అని అన్నారు.