Varun Tej : బర్త్ డే సందర్భంగా బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు వరుణ్ తేజ్ సహాయం.. విరాళం ఎంతో తెలుసా?

టాలీవుడ్ లో మెగా హీరోలు స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడమే కాదు, వారి సేవా గుణంతో అంతులేని అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన బర్త్ డే సందర్భంగా బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు విరాళం ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకున్నాడు.

Varun Tej : బర్త్ డే సందర్భంగా బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు వరుణ్ తేజ్ సహాయం.. విరాళం ఎంతో తెలుసా?

Varun Tej

Varun Tej : టాలీవుడ్ లో మెగా హీరోలు స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడమే కాదు, వారి సేవా గుణంతో అంతులేని అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నాడు. ఆయన దారిలోనే ఆయన వారసులు కూడా పయనిస్తున్నారు. నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. దేవానర్ బ్లైండ్ స్కూల్ పిల్లలకు తనవంతు సహాయం చేస్తున్న సంగతి ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దీపావళి నాడు ఆ పిల్లలికి టపాసులు పంపించడంతో వారు థాంక్యూ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున.. జేమ్స్ బాండ్ తరహాలో వరుణ్ తేజ్ కొత్త సినిమా..

తాజాగా మరోసారి ఆ అంధుల స్కూల్ కి విరాళం ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగబాబు, దేవానర్ స్కూల్ నుండి పిల్లలు హాజరయ్యారు. దేవానర్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో కలసి నాగబాబు కేక్ కట్ చేసి వరుణ్ తేజ్ పుట్టినరోజుని స్పెషల్ గా జరుపుకున్నాడు.

ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పిల్లల మధ్య ఇలా బర్త్ డే జరుపుకుంటే వారు కూడా చాలా సంతోష పడతారు. లాస్ట్ ఇయర్ కూడా వరుణ్ ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే తను బయటకి చెప్పుకోడు. ఇప్పుడు కూడా ఈ స్కూల్ కి రూ.1 లక్ష విరాళంగా ఇచ్చాడు. కాబట్టి మీరంతా మా వరుణ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటూ అతని దీవించాలని కోరుకుంటున్నాను’ అని కోరాడు.

కాగా వరుణ్ నటిస్తున్న 12వ చిత్రం గురించి నేడు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో వరుణ్ లుక్ అదిరిపోయింది.