వివాదంలో వాల్మీకి

వాల్మీకి టైటిల్‌పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

  • Publish Date - February 1, 2019 / 09:18 AM IST

వాల్మీకి టైటిల్‌పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్  డైరెక్షన్‌లో రూపొందబోయే వాల్మీకి సినిమా.. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న వాల్మీకి, షూటింగ్ స్టార్ట్ అవకముందే వివాదంలో చిక్కుకుంది. వాల్మీకి, తమిళ్‌లో సూపర్ హిట్ అయిన జిగర్తండా మూవీకి అఫీషియల్ రీమేక్. తమిళ్‌లో బాబీ సింహా చేసిన నెగెటివ్ క్యారెక్టర్‌ని తెలుగులో వరణ్ తేజ్ చేస్తుండగా, సిద్ధార్థ్ క్యారెక్టర్ నాగశౌర్య చేస్తున్నాడు. వాల్మీకి టైటిల్‌పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

వాల్మీకి అనే పేరుని గ్యాంగ్ స్టర్ అని చూపించడం కరెక్ట్ కాదని, ఆ పేరుపెట్టి, టైటిల్‌ లోగోలో గన్ చూపించడమేంటని.. కర్నూల్ జిల్లా మహానందిలో వాల్మీకులు భారీగా తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ వివాదంపై మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్న వాల్మీకి సినిమాకి కథ : కార్తీక్ సబ్బరాజ్, స్ర్కీన్ ప్లే : మధు, చైతన్య, కెమెరా : అయానంక బోస్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్ : చోటా కె.ప్రసాద్. ఆర్ట్ : అవినాష్ కొల్ల, ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా.
 
 

ట్రెండింగ్ వార్తలు