వాల్మీకీ ట్రైలర్: గద్దలకొండ గణేష్.. పక్కా మాస్.. వరుణ్ విశ్వరూపం చూశారా?

  • Published By: vamsi ,Published On : September 9, 2019 / 11:37 AM IST
వాల్మీకీ ట్రైలర్: గద్దలకొండ గణేష్.. పక్కా మాస్.. వరుణ్ విశ్వరూపం చూశారా?

వరుణ్ తేజ్ విశ్వరూపం చూడాలనిపిస్తే ఈ సినిమా చూడాల్సిందే అన్నంతగా ట్రైలర్ అదరిపోయింది వాల్మీకీ. వరుణ్ తేజ్ హీరోగా.. కాదు.. కాదు విలన్ గా నటిస్తున్న సినిమా వాల్మీకీ. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్ లు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ లో వరుణ్ తేజ్ విశ్వరూపం చూపించాడు.

గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ అదరగొట్టాడు. పక్కా మాస్ లుక్ తో వరుణ్ తేజ్ విశ్వరూపం చూపించాడు. తెలుగు ఇండ‌స్ట్రీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతుండగా.. ఈ క్రమంలోనే భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పుడు విడుదలైన వాల్మీకి ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం అర్థం అవుతుంది. కచ్చితంగా ఈ చిత్రంతో వరుణ్ తేజ్ సంచలనాలు రేపడం ఖాయంగా కనిపిస్తుంది.

వరుణ్ లుక్స్.. హరీష్ శంకర్ డైరెక్షన్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఊర మాస్ యాక్షన్ తో గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ యాక్షన్ అదిరిపోయింది. నా మీద పందేలు కడితే గెలుస్తరు.. నాతో పందెం కడితే సస్తరు అనే నాటు డైలాగులతో రచ్చ లేపాడు వరుణ్ తేజ్. నేను బొక్కలిరగ్గొట్టుడు సేమ్ టూ సేమ్ అంటూ తెలంగాణ యాసలో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ లు బాగా ఆకట్టుకుంటున్నాయి.