Vedaant Madhavan : ఒలంపిక్స్ లక్ష్యంగా కొడుకుని తయారు చేస్తున్న మాధవన్

వేదాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ''నా తండ్రి నీడలో నేను బతకాలని, ఎదగాలని అనుకోవడం లేదు. నాకు సొంతంగా ఓ గుర్తింపును సంపాదించుకోవాలని అనుకుంటున్నాను.......

Vedaant Madhavan : ఒలంపిక్స్ లక్ష్యంగా కొడుకుని తయారు చేస్తున్న మాధవన్

Vedanth

 

Vedaant Madhavan :  ఒకప్పుడు ప్రేమకథలతో అందర్నీ మెప్పించిన హీరో మాధవన్ ప్రస్తుతం హీరోతో పాటు స్పెషల్ క్యారెక్టర్ గా, విలన్ గా చేస్తున్నారు. ఇక మాధవన్ తనయుడు వేదాంత్ మంచి స్విమ్మర్ అని అందరికి తెలిసిందే. ఇప్పటికే పలు స్విమ్మింగ్‌ పోటీలలో జాతీయ, అంతర్జాతీయ పతకాలు కూడా గెలుచుకున్నాడు వేదాంత్. ప్రతి స్విమ్మింగ్ పోటీల్లో వేదాంత్ కచ్చితంగా ఏదో ఒక పతకం తీసుకొచ్చి తన తల్లి తండ్రులతో పాటు దేశం కూడా గర్వపడేలా చేస్తున్నాడు. నెటిజన్లు, మీడియా, దేశం యావత్తు వేదాంత్ ని పొగుడుతుంది.

ఒక హీరో కొడుకైనా తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడని అంతా అభినందిస్తున్నారు. ఇటీవల డెన్మార్క్‌లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌లో మాధవన్‌ కొడుకు వేదాంత్‌ రజత పతకం సాధించాడు. ఇక వేదాంత్ స్విమ్మింగ్ కోచింగ్ కి మాధవన్ ఫ్యామిలీతో సహా దుబాయ్ షిఫ్ట్ అయ్యాడు. తాజాగా డానిష్ స్విమ్మింగ్ పతకం సాధించిన వేదాంత్ మీడియాతో మాట్లాడాడు.

Balakrishna : హాస్పిటల్‌లో బాలయ్య.. మోకాలికి ఆపరేషన్.. ఆందోళనలో అభిమానులు..

వేదాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ”నా తండ్రి నీడలో నేను బతకాలని, ఎదగాలని అనుకోవడం లేదు. నాకు సొంతంగా ఓ గుర్తింపును సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను సంరక్షిస్తూనే ఉంటారు. నాకు కావాల్సినవి అన్ని సమకూరుస్తూనే ఉన్నారు. నా కోసం వారు దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు. నా కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. 2026లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడలకు నేను రెడీ అవుతున్నాను. దానికోసమే దుబాయ్ లో కోచింగ్ తీసుకోవడానికి షిఫ్ట్ అయ్యాను. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయింది” అని తెలిపాడు.

Serial Artist : లైంగిక వేధింపుల కేసులో సీరియల్ నటుడు అరెస్ట్

కొడుకు మాటలపై స్పందిస్తూ మాధవన్ కూడా మీడియాతో మాట్లాడారు. మాధవన్ మాట్లాడుతూ.. ”నా కొడుకు చెప్పింది 100 శాతం కరెక్ట్. నా కొడుకు సినిమాల్లోకి రానంత మాత్రాన, యాక్టర్ అవ్వనంత మాత్రాన నాకేమీ బాధ లేదు. పిల్లలకు ఇష్టమైన పనులను చేయనివ్వాలి, వారిని స్వేచ్చగా ఎదగనివ్వాలి. ప్రస్తుతం వేదాంత్ 2026 ఒలంపిక్ లో పతకం సాధించే లక్ష్యంగా కష్టపడుతున్నాడు” అని తెలిపారు.