Veera Simha Reddy: ఆ విషయంలో ‘అఖండ’కు రీసౌండ్ ఇవ్వనున్న వీరసింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Veera Simha Reddy: ఆ విషయంలో ‘అఖండ’కు రీసౌండ్ ఇవ్వనున్న వీరసింహారెడ్డి

Veera Simha Reddy BGM To Be Louder Than Akhanda

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Veera Simha Reddy : ‘సుగుణ సుందరి’ వచ్చేసింది.. బాలయ్య స్టెప్పులు అదరగొట్టేసాడుగా..

కాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ తాజా వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంగీతం థమన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఈ సినిమాకు కేవలం సాంగ్స్ మాత్రమే కాకుండా, బీజీఎం కూడా నెక్ట్స్ లెవెల్‌లో ఇచ్చాడట. ముఖ్యంగా బాలయ్య లాస్ట్ మూవీ ‘అఖండ’ బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ సినిమాలో థమన్ ఇచ్చిన బీజీఎంతో ప్రేక్షకులకు పూనకాలు వచ్చాయి. కొన్ని థియేటర్లు అయితే ఏకంగా సౌండ్ ఎక్కువగా ఉందని, చాలా తక్కువ సౌండ్‌తో ఆ సినిమాను ప్లే చేసిన సందర్భాలు కూడా మనం చూశాం.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి రన్‌టైమ్ ఫిక్స్.. ఎంతో తెలుసా?

అయితే, ఇప్పుడు ‘అఖండ’ను మించిపోయే రేంజ్‌లో వీరసింహారెడ్డి బీజీఎం ఉండబోతుందని తెలుస్తోంది. థమన్ మరోసారి ఈ సినిమా కోసం బాక్సులు బద్దలయ్యే బీజీఎం ఇచ్చాడని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి వీరసింహారెడ్డి బీజీఎంతో థియేటర్లు ఎలా రీసౌండ్ ఇస్తాయో తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.