Veera Simha Reddy: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న వీరసింహారెడ్డి

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి టాక్ ఇస్తుండటంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో సక్సెస్ అవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను ఒంటిచేత్తో లాక్కొచ్చాడని అభిమానులు తెలిపారు.

Veera Simha Reddy: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న వీరసింహారెడ్డి

Veera Simha Reddy Locks OTT Partner

Veera Simha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి టాక్ ఇస్తుండటంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో సక్సెస్ అవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను ఒంటిచేత్తో లాక్కొచ్చాడని అభిమానులు తెలిపారు.

Veera Simha Reddy Fans Reaction : అఖండ కంటే సూపర్..

ఇక ఈ సినిమాను చూసేందుకు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే తొలిరోజే భారీ వసూళ్లపై కన్నేశాడు వీరసింహారెడ్డి. ఇక ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Veera Simha Reddy Review : బాలయ్య మార్క్ సినిమా.. యాక్షన్ ఎలేవేషన్‌లో బోయపాటిని మించిన గోపీచంద్..

వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకుందట. బాలయ్య నటించిన లాస్ట్ మూవీ ‘అఖండ’ డిజిటల్ రైట్స్‌ను కూడా డిస్నీప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకోవడంతో, ఇప్పుడు ఈ సినిమాను కూడా వారే దక్కించుకున్నారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకున్నాకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.