Veera Simha Reddy: వీరసింహారెడ్డి వరల్డ్‌వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంతో తెలుసా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి వరల్డ్‌వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంతో తెలుసా?

Veera Simha Reddy Worldwide PRe-Release Business Details

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Veera Simha Reddy: తెల్లవారకముందే ఆట మొదలుపెడుతున్న వీరయ్య, వీరసింహారెడ్డి!

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు చూస్తే బాలయ్య కెరీర్‌లో ఈ సినిమా కూడా మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.75 కోట్ల మేర ప్రీరిలీజ బిజినెస్ జరిపింది. ఓ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి ఇది చాలా మంచి ప్రీరిలీజ్ బిజినెస్ అని చెప్పాలి. అయితే సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా కాన్ఫిడెంట్‌గా ఉండటంతోనే ఈ మేరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం – 15 కోట్లు
సీడెడ్ – 13 కోట్లు
ఆంధ్రా – 35 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 6 కోట్లు
ఓవర్సీస్ – 6 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 75 కోట్లు