Venkatesh : ‘హిట్’ దర్శకుడితో విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీ..

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో మైల్ స్టోన్ చిత్రం 75వ సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాని 'హిట్' సినిమాల దర్శకుడు శైలేశ్ కొలను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రం..

Venkatesh : ‘హిట్’ దర్శకుడితో విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీ..

venky5

Venkatesh : నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన క్రైమ్ థిల్లర్ సిరీస్ ‘హిట్’ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ శైలేశ్ కొల‌ను. ఇటీవల అడివి శేషు హీరోగా వచ్చిన హిట్ ది సెకండ్ కేస్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో శైలేశ్ కొలనుకి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కాగా శైలేశ్ ఏమో విక్టరీ వెంకటేష్ తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

Venkatesh: వెంకీ ల్యాండ్‌మార్క్ మూవీలో కేజీయఫ్ భామ.. నిజమేనా?

హిట్ యూనివర్స్ లో వెంకటేష్ కూడా ఉండబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ వచ్చింది. శైలేశ్, వెంకటేష్ తో సినిమా చేస్తున్న సంగతి నిజమే. కానీ అది హిట్ వర్స్ కాదు. ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అని తెలుస్తుంది. వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నడుస్తున్న వెంకటేష్ ని బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తుండగా, వెంకీ చేతిలో రివాల్వర్ పట్టుకొని ఉన్నాడు. కాగా హిట్-3లో నాని హీరో అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి ఇది హిట్ వర్స్ మూవీ కాదు.

జనవరి 25న ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నట్లు తెలియజేశాడు వెంకటేష్. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మూవీకి సంబంధించిన మరికొన్ని వివరాలు ఈ బుధవారం తెలిసే అవకాశం ఉంది. వెంకటేష్ కెరీర్ లో ఇది మైల్ స్టోన్ మూవీ కావడంతో చాలా అంచనాలు నెలకొన్నాయి. సీనియర్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ 75వ సినిమా ఉండబోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ వెంకీ ఒక యంగ్ డైరెక్టర్ కి ఆ బాధ్యతలు అప్పగించాడు. మరి ఆ నమ్మకాన్ని శైలేశ్ కొలను అందుకోగలడా? లేదా? అనేది చూడాలి.