Venkatesh – Nani : వెంకీ మామతో నాని పోటీ.. ఇద్దరు చైల్డ్ సెంటిమెంట్‌తోనే రాబోతున్నారు!

విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాతో నాని తన 30వ చిత్రంతో క్రిస్మస్ బరిలో నిలవబోతున్నారు. అది కూడా ఒకే సెంటిమెంట్ స్టోరీతో..

Venkatesh – Nani : వెంకీ మామతో నాని పోటీ.. ఇద్దరు చైల్డ్ సెంటిమెంట్‌తోనే రాబోతున్నారు!

Venkatesh and Nani are in christmas with Saindhav and Nani30

Venkatesh – Nani : విక్టరీ వెంకటేష్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం సైంధవ్ (Saindhav). ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా తెరకెక్కుతుంది. హిట్ వంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ నిన్న (ఏప్రిల్ 15) వైజాగ్ లో మొదలైంది. శ్రద్ధ శ్రీనాధ్ (Shraddha Srinath) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Dasara Movie: నైజాంలో కొనసాగుతున్న ‘దసరా’ స్ట్రాంగ్ రన్..!

ఇక దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని తన 30వ సినిమాని పట్టాలు ఎక్కించేశాడు. Nani30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేయనున్నాడు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు. కాగా డిసెంబర్ 22న సైంధవ్ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Akhil Akkineni : శోభితతో నాగచైతన్య రిలేషన్.. మీడియా ముందు అఖిల్ ఏమి మాట్లాడాడో తెలుసా?

ఒక రోజు గ్యాప్ తోనే వస్తుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వెంకీ అండ్ నాని మధ్య ఫైట్ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉందట. ఈ రెండు సినిమాలు చైల్డ్ సెంటిమెంట్ తో రాబోతున్నాయి. Nani30 సినిమా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ తో తెరకెక్కుతుంది. ఇక సైంధవ్ సినిమా స్టోరీ కూడా ఒక చైల్డ్ చుట్టూ తిరుగుతుందట. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ చైల్డ్ ని కాపాడుకోడానికి వెంకీ మామ యుద్ధం చేయబోతున్నాడని సమాచారం. మరి ఈ చైల్డ్ సెంటిమెంట్ తో ఆడియన్స్ చేత ఎవరు ఓకే అనిపించుకుంటారో చూడాలి.