Salman Khan : వెంకటేష్ బాలీవుడ్ సినిమా.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్.. | Venkatesh bollywood movie directed by Salman khan

Salman Khan : వెంకటేష్ బాలీవుడ్ సినిమా.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్..

సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో వెంకటేష్ కూడా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్.............

Salman Khan :  వెంకటేష్ బాలీవుడ్ సినిమా.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్..

Salman Khan :  ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. వెంకటేష్ తో సల్మాన్ ఖాన్ కి ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరూ మంచి స్నేహితులు. దీంతో వెంకటేష్ ని ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయమని అడిగాడట సల్మాన్. అందుకు వెంకటేష్ కూడా ఒప్పుకున్నాడు. దీంతో ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ సినిమాలో వెంకటేష్ కూడా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.

తాజాగా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి డైరెక్టర్ ఫర్హాద్‌ సమ్జీ తప్పుకున్నారని సమాచారం. గత ఏడాది అక్టోబర్‌లో ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ సినిమా ప్రారంభమైంది. అయితే కరోనా కారణంగా బ్రేక్ పడి మళ్ళీ ఇటీవలే మొదలైంది. మొదటి షెడ్యూల్ అవుట్‌పుట్‌ చూసిన సల్మాన్‌ఖాన్‌ అది నచ్చలేదని తెలిపి మళ్ళీ రీషూట్ చేద్దామని నిర్మాతని అడిగాడట. దీంతో డైరెక్టర్ ఫర్హాద్‌ సమ్జీ అవమానంగా ఫీల్ అయి దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది.

Akshay kumar : బ్రిటిష్ వాళ్ళు చేసిందే మనము చేస్తున్నాము.. సౌత్, నార్త్ అనే విభజన కరెక్ట్ కాదు..

 

దీంతో గత కొన్ని రోజులుగా ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ సినిమా దర్శకత్వ వ్యవహారాలను సల్మాన్‌ఖాన్‌ చూస్తున్నాడట. ఈ సినిమాని దర్శకుడి సహాయం లేకుండా తనే డైరెక్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడట సల్మాన్ ఖాన్. దీంతో బాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమాని సల్మాన్ ఖాన్ డైరెక్ట్ చేయబోతున్నాడు.

×