Venkatesh : ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు.. లేదంటే లేదు.. నంది అవార్డులపై వెంకటేష్ కామెంట్స్!

నంది అవార్డ్స్ ఇష్యూ గురించి విక్టరీ వెంకటేష్ వైరల్ కామెంట్స్ చేశాడు. ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు లేదంటే లేదు. నేను అవార్డులు గురించి..

Venkatesh Nandi Awards : టాలీవుడ్ నిర్మాతలు, నటులు నంది అవార్డ్స్ గురించి ఏదొక వేదిక పై కామెంట్స్ చేస్తూనే ఉంటున్నారు. కానీ ఏపీ (Andhra Pradesh) మరియు తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ విషయమై ఎటువంటి ముందడుగు తీసుకోవడం లేదు. స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే ఈ అవార్డ్స్ ని సినిమా ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్ ఎంతో గౌరవంగా భావిస్తారు. అలాంటి నంది అవార్డుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు 2016లో నుంచి ఇవ్వడం ఆపేశాయి.

Kamal – Rajini : కమల్ హాసన్‌తో రజినీకాంత్ సినిమా.. కన్‌ఫార్మ్ చేసిన లోకనాయకుడు!

తాజాగా ఈ అవార్డ్స్ గురించి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా కామెంట్స్ చేశాడు. తన అన్న సురేష్ బాబు చిన్న కొడుకు మరియు దగ్గుబాటి రానా (Rana Daggubati) తమ్ముడు అభిరామ్ (Abhiram) హీరోగా పరిచయం అవుతూ చేస్తున్న సినిమా అహింస (Ahimsa). తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వేదిక పైనే నంది అవార్డ్స్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “నేను అవార్డులు గురించి ఎప్పుడు ఆలోచించను. ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు లేదంటే లేదు. కానీ అవార్డులు అనేవి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ను అందిస్తాయి” అంటూ వ్యాఖ్యానించాడు.

Ram Charan : రామ్‌చరణ్‌ సినిమా అయితేనే థియేటర్‌కి వెళ్తా.. ఆ మూవీ నుంచి తనకి ఫ్యాన్ అయ్యిపోయా.. తేజ!

ఇక వెంకటేష్ వంటి స్టార్ హీరో కూడా ఈ అవార్డ్స్ పై కామెంట్ చేయడంతో నంది అవార్డు ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. కాగా ఈ విషయం గురించి ఇటీవల గీతా ఆర్ట్స్ బన్నీ వాసు, అంతకుముందు సీనియర్ నిర్మాతలు సి కళ్యాణ్, అశ్విని దత్త్, జి ఆదిశేషగిరిరావు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మరి ప్రభుత్వాలు ఇప్పటికైన ఏమన్నా ముందడుగు తీసుకుంటారా? లేదా? చూడాలి.

ట్రెండింగ్ వార్తలు