Venkatesh : ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేశాను.. రానాకి ఎదురుగా నటించాలంటే కష్టమే..

వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమాల్లో నటించడానికి వెబ్ సిరీస్ లలో నటించడానికి చాలా తేడా ఉంది. సిరీస్ లో లో చాలా ఫాస్ట్ గా నటించడానికి నాకు కొంత సమయం పట్టింది. ఇందులో నేను చాలా వరకు నెగిటివ్ రోల్ లో చేయడం సవాలుగా...............

Venkatesh :  ఇటీవల స్టార్ హీరోలంతా ఓటీటీ బాట పట్టి పలు వెబ్ సిరీస్ లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి బాబాయ్ – అబ్బాయిలు వెంకటేష్-రానా కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించారు. నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో భారీగా తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. బాలీవుడ్ లో సెలబ్రిటీలకు సమస్యలు వస్తే వాటిని తీర్చే పాత్రలో రానా కనిపిస్తుండగా రానా తండ్రిగా వెంకటేష్ నెగిటివ్ రోల్ లో కనపడనున్నాడు. ఇప్పటికే రెడీ అయిన ఈ సిరీస్ మార్చ్ 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

రానా – వెంకటేష్ కలిసి నటిస్తుండటంతో దగ్గుబాటి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. రానా నాయుడు సిరీస్ తెలుగుతో పాటు సౌత్ భాషల్లో, హిందీలో పాన్ ఇండియా సిరీస్ గా రిలీజ్ అవ్వబోతుంది. తాజాగా రానా నాయుడు ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ పలు విషయాలను పంచుకున్నాడు.

RRR Re Release : అమెరికాలో RRR రీ రిలీజ్.. అతి పెద్ద థియేటర్ హౌస్ ఫుల్.. టికెట్ల కోసం క్యూ లైన్లో ఫారినర్స్..

వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమాల్లో నటించడానికి వెబ్ సిరీస్ లలో నటించడానికి చాలా తేడా ఉంది. సిరీస్ లో లో చాలా ఫాస్ట్ గా నటించడానికి నాకు కొంత సమయం పట్టింది. ఇందులో నేను చాలా వరకు నెగిటివ్ రోల్ లో చేయడం సవాలుగా అనిపించింది. మరోసారి ఈ సిరీస్ నాలోని కొత్త కోణాన్ని చూపించడానికి ఉపయోగపడింది. ఇందులో నాగ నాయుడు పాత్రలో కనిపించబోతున్నాను. మేమిద్దరం బయట బాబాయ్ – అబ్బాయి అయినా మంచి స్నేహితులుగా ఉంటాం. ఇప్పుడు ఈ సిరీస్ లో రానా, నేను తండ్రి కొడుకులుగా నటించాం. మేమిద్దరం చాలా క్లోజ్ కానీ ఇందులో ఒకరంటే ఒకరికి పడని క్యారెక్టర్స్ లో నటించడం కొంచెం కష్టమనిపించింది. ఈ సిరీస్ మా ఇద్దరికీ ఓ కొత్త ప్రయత్నం. కచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుంది. రానాకు ఎదురుగా నిల్చొని నటించడం కొంచెం కష్టమే. నా వరకు ఇదొక సంక్లిష్టమైన పాత్ర. ఇలాంటి పాత్రలు నాకు ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు