Venkatesh: పాతికేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి వెంకీ.. సల్లుభాయ్‌తో రీ ఎంట్రీ!

టాలీవుడ్ సీనియర్ హీరోలలో వెంకటేష్ రూటే సపరేటు. సెంటిమెంట్ నుండి గగుర్పొడిచే యాక్షన్ సినిమాల వరకు అవలీలగా పండించే వెంకీ కామెడీ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నాడు.

Venkatesh: పాతికేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి వెంకీ.. సల్లుభాయ్‌తో రీ ఎంట్రీ!

Venkatesh

Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరోలలో వెంకటేష్ రూటే సపరేటు. సెంటిమెంట్ నుండి గగుర్పొడిచే యాక్షన్ సినిమాల వరకు అవలీలగా పండించే వెంకీ కామెడీ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే వెంకీ అంటే విక్టరీ అనే బ్రాండ్ పడిపోయింది. వెంకీ ఒకప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ లో కూడా డైరెక్ట్ సినిమాలు చేశాడు. మన దగ్గర బ్లాక్ బస్టర్ సినిమాలైనా చంటి, యమలీల సినిమాలను అక్కడ అనారి, తక్ దీర్ వాలా గా రీమేక్ చేసి హిట్స్ కొట్టాడు.

Kashish Khan : ‘అనుభవించు రాజా’ హీరోయిన్.. కవ్విస్తున్న కాశిష్‌ఖాన్

కానీ, ఆ తర్వాత తెలుగుకే పరిమితమైన వెంకీ మళ్ళీ బాలీవుడ్ సినిమాల జోలికెళ్లలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ పాతికేళ్ల తర్వాత వెంకీ బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. సల్లు భాయ్ వెంకీ మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి పలు యాడ్స్ లో నటించడమే కాకుండా ఇద్దరూ కలిసి ఇతర దేశాలలో క్రికెట్ మ్యాచ్ లకు అటెండ్ అయ్యే వాళ్ళు. సల్మాన్ హైదరాబాద్ వస్తే తప్పకుండ వెంకీని కలిసి పండగ చేసుకోవాల్సిందే. అంత స్నేహం ఉంది ఈ ఇద్దరి మధ్య.

Sudheer-Rashmi : ‘ఢీ’ షో నుంచి సుధీర్, రష్మీ అవుట్.. షో చూడం అంటున్న అభిమానులు

అందుకే వెంకీ ఇప్పుడు సల్మాన్ సినిమాతో మళ్ళీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కోలీవుడ్ లో వీరమ్ సినిమా ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. అజిత్ మార్క్ యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా అక్కడ రికార్డులు కొలకొల్పింది. తెలుగులో ఇదే సినిమాను కాటమరాయుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు. కాగా, ఇప్పుడు బాలీవుడ్ సల్మాన్ ఈ సినిమా రీమేక్ చేస్తున్నాడు. మార్పులు, చేర్పులు చేసిన ఈ కథతో వెంకీ మరో స్ట్రాంగ్ పాత్రతో ఈ ఎంట్రీ ఇవ్వనున్నాడట. మరి ఈ సినిమా తర్వాత కూడా వెంకీ బాలీవుడ్ లో కంటిన్యూ చేస్తాడా లేక సల్మాన్ కోసమే ఈ సినిమా చేస్తున్నాడా అన్నది చూడాల్సి ఉంది.