Saindhav : సైంధవ్ అప్డేట్.. రాంపేజ్ అంటున్న వెంకటేష్!

విక్టరీ వెంకటేష్ (Venkatesh) తన మైల్ స్టోన్ మూవీని ఒక యువ దర్శకుడితో ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి సిద్దమయ్యాడు. 'హిట్' క్రైమ్ సిరీస్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న శైలేష్ కొలనుతో 'సైంధవ్' (Saindhav) అనే సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి..

Saindhav : విక్టరీ వెంకటేష్ (Venkatesh) గత ఏడాది F3 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ తరువాత విశ్వక్ సేన్ (Vishwak Sen) ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇక ఇటీవలే తన మైల్ స్టోన్ మూవీ ని అనౌన్స్ చేశాడు. తన కెరీర్ లో 75వ చిత్రాన్ని ఒక యువ దర్శకుడితో ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి వెంకటేష్ సిద్దమయ్యాడు. ‘హిట్’ క్రైమ్ సిరీస్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ (Saindhav) అనే సినిమాని అనౌన్స్ చేశాడు. మూవీ ప్రకటిస్తూనే.. రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆడియన్స్ లో మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది.

ఇక ఈ గ్లింప్స్ లో వెంకటేష్ మిషన్ గన్ పట్టుకొని ఉండడం చూస్తుంటే.. మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని అర్ధమవుతుంది. అలాగే గ్లింప్స్ ఒక మెడికల్ డ్రగ్ ని ప్రత్యకంగా చూపించారు. దీంతో ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ వైరల్ అవుతుంది. ఆ డ్రగ్ చిన్నపిల్లలకి ఇచ్చే రేర్ మెడిసిన్ అని, అది చాలా రేటు ఉంటుందని. ఆ డ్రగ్ తనకి సంబంధించిన పిల్లవాడికి వెంకటేష్ సంపాదించే ప్రయత్నమే సినిమా కథని రాసుకొస్తున్నారు. ఏదేమైనా సినిమా పై భారీ అంచనాలు అయితే క్రియేట్ చేశారు వెంకటేష్ అండ్ శైలేష్.

కాగా ఈ సినిమా గురించి ఉగాది సందర్భంగా వెంకటేష్ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. రేపటి (మార్చి 23) నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వెళ్లబోతుంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రాంపేజ్ రోలింగ్ అంటూ ఒక మాస్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాతో వెంకటేష్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు.ఈ చిత్రాన్ని నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీలోని ఇతర కాస్టింగ్ డీటెయిల్స్ కూడా తెలియజేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు