మరో మల్టీస్టారర్‌లో విక్టరీ వెంకటేష్!

మరో మల్టీస్టారర్‌లో విక్టరీ వెంకటేష్!

మరో మల్టీస్టారర్‌లో విక్టరీ వెంకటేష్!

మల్టీస్టారర్ మూవీలకు కేరాఫ్ అయిపోయారు ‘విక్టరీ వెంకటేష్’. మహేష్ బాబుతో కలసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కల్యాణ్ తో కలసి ‘గోపాల గోపాల’, వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్2’ సినిమాలను చేసి  ఆకట్టుకున్న వెంకీ ఇప్పుడు నాగ చైతన్యతో వెంకీ మామ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు.
Read Also : ‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ విడుదల వాయిదా: ప్రకటించిన వర్మ

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. దర్శకుడు వీరు పోట్ల వెంకీ కోసం ఓ మల్టీస్టారర్ కథను సిద్ధం చేశాడట. ఈ చిత్రంలో వెంకీతో కలసి రవితేజ నటించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతుండగా… త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 
Read Also : శ్రీ దేవి బయోపిక్ లో బాలీవుడ్‌ హీరోయిన్‌!

×