Narappa : విక్టరీ వెంకటేష్ వన్‌మెన్ షో ‘నారప్ప’..

విక్టరీ వెంకటేష్‌.. రీమేక్ సినిమాలైనా, సోలో సినిమాలైనా, మల్టీస్టారర్ అయినా ముందుంటారు..

Narappa : విక్టరీ వెంకటేష్ వన్‌మెన్ షో ‘నారప్ప’..

Narappa Review

Narappa: విక్టరీ వెంకటేష్‌.. రీమేక్ సినిమాలైనా, సోలో సినిమాలైనా, మల్టీస్టారర్ అయినా ముందుంటారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో వెంకటేష్‌కి ఏ రేంజ్ క్రేజ్ ఉందనేది కొత్తగా చెప్పక్కర్లేదు. ‘ద‌ృశ్యం’, ‘వెంకీమామ’ తర్వాత వెంకీ నటించిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’.. మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ, ధనుష్ నటించిన తమిళ్ సూపర్ హిట్ ‘అసురన్’ కి తెలుగు రీమేక్. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మించారు.

ఈ సినిమా ఓటీటీలోనే విడుదలవుతుందంటూ వార్తలు వచ్చాయి. లేదు థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చిన నిర్మాతలు ప్రస్తుత పరిస్థితులు నేపథ్యంలో ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేసేశారు. జూన్ 19 రాత్రి 10 గంటలనుండి సినిమా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో చాలామంది ‘అసురన్’ చూసినా సరే మళ్లీ ‘నారప్ప’ చూస్తారు ఎందుకంటే ఇది వెంకీ సినిమా. చాలా రోజుల తర్వాత తన ఇమేజ్‌కి భిన్నంగా ఆయన చేసిన మాస్ మసాలా సినిమా కాబట్టి. కథ, విశ్లేషణ వంటివి పక్కనపెడితే ‘నారప్ప’ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.

Narappa
వెంకీ విశ్వరూపం..
‘అసురన్’ రీమేక్.. వెంకటేష్ హీరో, శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ అనగానే.. కంప్లీట్ తమిళ్ నేటివిటీతో రా కంటెంట్‌తో వచ్చిన అలాంటి సినిమాను మన తెలుగు నేపథ్యానికి ఎలా అడాప్ట్ చేస్తారు. వెంకీ మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు అనే మాటలు వినిపించాయి. స్వయంగా వెంకీనే ఈ క్యారెక్టర్ చెయ్యడం చాలా టఫ్ అని కూడా చెప్పారు. కట్ చేస్తే.. వెంకటేష్ సాధారణంగా మాస్ చెయ్యడు కానీ చేస్తే ఆ క్యారెక్టర్ మరెవరు చెయ్యలేరన్నంతగా చేస్తారు అనిపించారు. పౌరుషం లేని తాగుబోతు తండ్రిగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటుడిగా వెంకీ సీనియార్టీ కనిపిస్తుంది.

Narappa

ఇక త‌న కుటుంబం జోలికి వ‌స్తే మాత్రం శ‌త్రువుల‌ను చీల్చిచెండాడే ఫిరోషియ‌స్ ‘నార‌ప్ప‌’ గా వెంక‌టేష్ న‌ట‌న సింప్లీ సూపర్బ్. యాక్షన్ సన్నివేశాల్లో వెంకటేష్ తన విశ్వరూపాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించారు. ‘నారప్ప’ సినిమా వెంకటేష్‌ వన్‌మెన్‌ షో అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో వచ్చే యంగ్ ‘నారప్ప’ ఫ్లాష్‌బ్యాక్‌లోనూ తన పర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశారు వెంకీ. ముఖ్యంగా ఆ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. 

NARAPPA

‘నారప్ప’ ఫ్యామిలీ..
నారప్ప భార్య సుందరమ్మగా ప్రియమణి చాలా రోజుల తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎమోషనల్ సీన్స్‌లో తన నటనతో ఆకట్టుకుంది. నారప్ప పెద్దకొడుకు మునికన్నా పాత్రలో కార్తీక్ రత్నం చాలా బాగా నటించాడు. ఎగ్రెసివ్ రోల్‌లో తన యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. నారప్ప చిన్న కొడుకు సిన్నప్ప క్యారెక్టర్‌లో రాఖీ చాలా చక్కగా నటించాడు. అన్న హత్యతో ప్రతీకారంతో రగిలిపోతున్న తల్లి బాధను చూడలేక పాండు స్వామిని చంపడం దగ్గరినుండి ప్రతి సీన్‌లోనూ చక్కటి నటన కనబరిచాడు. నారప్ప కూతురిగా బేబి చిత్ర కనిపించింది. నారప్ప బావగా రాజీవ్ కనకాల చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిగతా క్యారెక్టర్స్ చేసిన నటులంతా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.NARAPPA

టెక్నికల్ టీమ్..
నార‌ప్ప సినిమాకు మెయిన్ ప్లస్ మెలోడిబ్రహ్మ మణిశర్మ మ్యూజిక్. పాటలన్నీ కథలో భాగంగా వచ్చి వెళ్లిపోతుంటాయి. అయితే యాక్షన్‌ సీన్స్ ఎలివేట్‌ చేయడంలో మణిశర్మ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆడియెన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ముఖ్యంగా ‘రా నరకరా.. నరకరా’ థీమ్ సాంగ్ హైలెట్ అయింది. శ్యామ్‌ కె. నాయుడు విజువ‌ల్స్ సినిమా నుండి ఎక్క‌డా డీవియేట్ కాకుండా చేశాయి. మార్తాండ్‌ కె. వెంకటేష్ ఎడింటింగ్ బాగుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, వి. క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.

Narappa : ఓ ‘నారప్ప’.. నిను చూడంగానే విప్పారిందోయ్ ‘నారెప్ప’..

ఓవరాల్‌గా ‘నారప్ప’.. 

జనరల్‌గా ఒక సినిమాని ఆదరించడానికి పలు కారణాలుంటాయి. తమిళనాట ‘అసురన్’ మూవీకి అంతటి అప్లాజ్ రావడానికి మెయిన్ రీజన్ అక్కడి సామాజిక పరిస్థితులు, అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథ చెప్పడం. ధనుష్ లాంటి యంగ్ హీరో చేసిన ఛాలెంజింగ్ రోల్ వెంకటేష్ లాంటి సీనియర్ హీరో చేయడమనేది అభినందించాల్సిన విషయం. శ్రీకాంత్ అడ్డాల.. చక్కటి లవ్, ఫ్యామిలీ సినిమాలు చేశారు. ఒక్క సినిమా ఫ్లాప్‌తో మళ్లీ సినిమా రావడానికి సంవత్సరాలు పట్టింది. చాలా వరకు ఒరిజినల్ ‘అసురున్’ ని ఫాలో అయినా కానీ కథలో సోల్ మిస్ కాకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్లు సినిమాను చక్కగా డీల్ చేశారు. ముఖ్యంగా మంచి డైలాగ్స్ రాశారు. ‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు సిన్నప్పా’.. ‘ఒకే మ‌ట్టిమీద ఉంటున్నాం. ఒకే భాష మాట్లాడుతున్నాం ఇవి చాల‌వా క‌లిసి బ్ర‌త‌క‌డానికి’ వంటి డైలాగ్స్ ప్రేక్ష‌కుల్ని ఆలోచింప‌జేస్తాయి. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అయ్యామనే ఫీలింగ్ అనిపించినా ‘నారప్ప’ మాత్రం ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడనే అంటున్నారు సినీ వర్గాలవారు, ప్రేక్షకులు.