Venkatesh: వెంకీ ల్యాండ్‌మార్క్ మూవీలో కేజీయఫ్ భామ.. నిజమేనా?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ను త్వరలోనే స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా, ఇటీవల వెంకీ తన నెక్ట్స్ మూవీని ఓ యంగ్ డైరెక్టర్‌తో చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. హిట్, హిట్-2 వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయబోతున్నాడట.

Venkatesh: వెంకీ ల్యాండ్‌మార్క్ మూవీలో కేజీయఫ్ భామ.. నిజమేనా?

Venkatesh Next Movie With Sailesh Kolanu Heroine Confirmed

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ను త్వరలోనే స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా, ఇటీవల వెంకీ తన నెక్ట్స్ మూవీని ఓ యంగ్ డైరెక్టర్‌తో చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. హిట్, హిట్-2 వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయబోతున్నాడట.

Venkatesh: శైలేష్‌తో సినిమాను ఆ రోజున స్టార్ట్ చేస్తోన్న వెంకీ..?

ఇప్పటికే వెంకటేష్‌కు ఓ అదిరిపోయే కథను శైలేష్ వినిపించగా, వెంకీ ఈ స్టోరీకి ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో మరో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు హీరోయిన్‌ను కూడా ఫిక్స్ చేశారట. కేజీయఫ్, కేజీయఫ్ 2 చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Venkatesh: వెంకీకి ఆ పాత్రలో మరో ‘హిట్’ ఇస్తానంటోన్న డైరెక్టర్..?

అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని పక్కనబెడితే, వెంకీతో ఈ హీరోయిన్ సినిమా చేయబోతుందని తెలియగానే టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు వెంకీ ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిజంగానే వెంకీతో శ్రీనిధి శెట్టి రొమాన్స్ చేయనుందా.. వారిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.