Sai Pallavi: సాయి పల్లవికి నేషనల్ అవార్డ్ ఖాయం: వెంకటేష్

విరాటపర్వం.. ప్రస్తుతం ఈ సినిమా పేరుతో తెలుగు ఆడియెన్స్ ఊగిపోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించగా, యంగ్ హీరో రానా దగ్గుబాటి...

Sai Pallavi: సాయి పల్లవికి నేషనల్ అవార్డ్ ఖాయం: వెంకటేష్

Venkatesh Predicts National Award To Sai Pallavi For Virata Parvam

Sai Pallavi: విరాటపర్వం.. ప్రస్తుతం ఈ సినిమా పేరుతో తెలుగు ఆడియెన్స్ ఊగిపోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించగా, యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవిలు ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక నక్సల్ నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకావ్యంగా ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దాడు. ఈ సినిమాను విప్లవం, ప్రేమ అనే రెండు విభిన్న అంశాల కలయికతో తీర్చిదిద్దాడు దర్శకడు వేణు ఉడుగుల. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sai Pallavi : గత జన్మలో తెలంగాణలో పుట్టానేమో

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతూ హీరో వెంకటేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి యాక్టింగ్‌కు తాను కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయానని.. విరాట పర్వం సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డ్ రావడం ఖాయమని అన్నారు. ఈ కామెంట్స్‌కు అక్కడున్న అభిమానులు చప్పట్లు, విజిల్స్‌తో హంగామా చేశారు.

Sai Pallavi : మీ ప్రేమని ఎలా తిరిగివ్వాలి..

అటు రానా కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో ముందుకెళ్లడం చూస్తుంటే గర్వంగా ఉందని వెంకీ అన్నారు. అయితే ఈ సినిమాకు మరో ఇద్దరు ముఖ్య అతిథులుగా రావాల్సిన రామ్ చరణ్, సుకుమార్ కొన్ని కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. ఇక దర్శకుడు వేణు ఉడుగులు మాట్లాడుతూ, ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పని చేశామని.. ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకుల చేతుల్లో పెడుతున్నామని ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సినిమాకు సాయి పల్లవి, రానాలు ఇద్దరు పిల్లర్లుగా నిలిచారని దర్శకుడు ఈ సందర్భంగా అన్నారు. మరి రేపు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే అంచనాలతో రిలీజ్ అవుతున్న విరాటపర్వం ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయగా, సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్‌ను అందించాడు.