Venkatesh : బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న వెంకీమామ

వెంకటేష్ తీసిన 'చంటి' సినిమాని హిందీలో ‘అనారి’తో రీమేక్ చేశారు. వెంకటేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఈ సినిమాతోనే ఇచ్చారు. 1993లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. తాజాగా...

Venkatesh : బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న వెంకీమామ

Venkatesh

Venkatesh :   ఇప్పటి హీరోలంతా పాన్ ఇండియా ఇమేజ్ కోసం పాకులాడుతున్నారు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఒకప్పటి హీరోలు గతంలోనే బాలీవుడ్ లో సినిమాలు చేసి వచ్చేశారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. ఇలా చాలా మంది హీరోలు 90లలోనే హిందీ సినిమాలు చేశారు. ఇప్పటి హీరోలు సినిమాలని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కానీ అప్పటి స్టార్ హీరోలు హిందీలోనే డైరెక్ట్ సినిమాలు తీశారు. కొన్ని సినిమాలు తీసి బాలీవుడ్ కి బాయ్ చెప్పి టాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు.

తాజాగా సినిమా పరిధి రోజు రోజుకి పెరుగుతుంది. ప్రతి సినిమా దేశమంతటా విడుదల అవుతుంది. మన హీరోలు కూడా వేరే భాషలో నటించాలని కోరుకుంటున్నారు. దీంతో ఒకప్పటి స్టార్ హీరోలు సైతం మళ్ళీ బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

వెంకటేష్ కెరీర్‌లో దాదాపు 75 సినిమాలు చేశారు. వాటిలో చాలా వరకు రీమేక్స్ కూడా ఉన్నాయి. తెలుగులో వెంకటేష్ తీసిన ‘చంటి’ సినిమాని హిందీలో ‘అనారి’తో రీమేక్ చేశారు. వెంకటేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఈ సినిమాతోనే ఇచ్చారు. 1993లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. వెంకీకి హిందీలోనూ పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన ‘యమలీల’ సినిమా తెలుగులో భారీ విజయం సాధించింది. ఈ సినిమాని వెంకటేష్ హిందీలో ‘తక్‌దీర్‌వాలా’గా రీమేక్ చేశారు.

Arjith Shankar : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ శంకర్ తనయుడు

ఆ తర్వాత బాలీవుడ్‌లో ఇప్పటివరకు వెంకీ సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్ హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ అయితే వెంకీమామకి మంచి స్నేహితుడు, బాగా క్లోజ్ కూడా. వెంకీమామ కూతురి పెళ్ళికి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా కూడా వచ్చారు. అయితే వెంకటేష్ తాజాగా దాదాపు 27 ఏళ్ల తర్వాత హిందీలో సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.

Telugu Movies : సినిమాల రిలీజ్ డేట్స్‌ పై దిల్‌రాజు ప్రెస్‌మీట్

వెంకటేష్ కి బాగా క్లోజ్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ తోనే కలిసి ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ కామెడీ మల్టీస్టారర్ ఫిల్మ్‌ తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. అలాగే తెలుగులో భారీ విజయం సాధించిన ‘ఎఫ్‌ 2’ హిందీ రీమేక్‌లో వెంకటేశ్, అర్జున్‌ కపూర్‌ నటిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏదిఏమైనా విక్టరీ బాబు మళ్ళీ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండటంతో దగ్గుబాటి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.