Venkatesh: ఎఫ్ 3 టీమ్‌కి వెంకీ మామ స్పెషల్ ట్రీట్..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. వెంకటేష్ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ పంచ్ లు.. తమన్నా, మెహ్రీన్ గ్లామర్ కు తోడు రాజేంద్రప్రసాద్..

Venkatesh: ఎఫ్ 3 టీమ్‌కి వెంకీ మామ స్పెషల్ ట్రీట్..!

Venkatesh

Venkatesh: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. వెంకటేష్ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ పంచ్ లు.. తమన్నా, మెహ్రీన్ గ్లామర్ కు తోడు రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ నటులు తోడవడంతో అనిల్ రావిపూడి కథ ఎక్కడికో వెళ్ళింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతుంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదలకు ప్రకటించారు.

Parineeti Chopra: చూపులతోనే బ్లాక్ మ్యాజిక్ చేసే పరిణీతి!

కాగా.. ఎఫ్ 2తో పోలిస్తే ఎఫ్‌ 3 సినిమాలో ఫన్ అండ్ గ్లామర్ డోస్ పెంచిన అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ కోసం తమన్నా, మెహరీన్ కు తోడుగా సోనాల్ చౌహన్ ను కూడా తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి టార్గెట్ గా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీమ్ కి వెంకీ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ టీ బ్రేక్ గురించి వరుణ్ తేజ్ పోస్ట్ చేస్తూ.. ‘వెంకీ బ్రో ఇంట్లో టీ టైమ్. లవ్లీ హోస్ట్‌ గా ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ ఫోటో కూడా పోస్ట్ చేశాడు.

Katrina Kaif-Vicky Kaushal: ఒక్కటవుతున్న క్యాట్-విక్కీ.. పెళ్లెప్పుడంటే?

అలాగే అనిల్ రావిపూడి కూడా ఈ టీ పార్టీ గురించి పోస్ట్ చేస్తూ.. ‘షూట్ గ్యాప్ లో కొన్ని సరదా సంభాషణలతో మా వెంకీ గారి ఇంటి దగ్గర చిల్లింగ్ టీ బ్రేక్’ అంటూ మెసేజ్ తో ఫోటో కూడా పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటోలో వెంకీతో పాటు వరుణ్, తమన్నా, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, సునీల్, అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. జిగేల్ మనిపించే లైట్ల మధ్య.. గుమగుమలాడే టీని ఆస్వాదిస్తూ అందరూ నవ్వుతూ కనిపించారు.

 

View this post on Instagram

 

A post shared by Anil Ravipudi (@anilravipudi)