Venkatesh: హిందీలో వార్నింగ్ ఇచ్చిన వెంకీ.. క్యా బాత్ హై అంటోన్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘సైంధవ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఇటీవల స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇక వెంకీ తొలిసారి నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ‘రానా నాయుడు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో మరో హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Venkatesh: హిందీలో వార్నింగ్ ఇచ్చిన వెంకీ.. క్యా బాత్ హై అంటోన్న ఫ్యాన్స్..!

Venkatesh Stylish Promotions For Rana Naidu

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘సైంధవ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఇటీవల స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇక వెంకీ తొలిసారి నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ‘రానా నాయుడు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో మరో హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Venkatesh : ‘హిట్’ దర్శకుడితో విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీ..

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, దీన్ని ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా, రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌ను వెంకీ చాలా వెరైటీగా చేస్తున్నాడు. తాజాగా ఆయన చేతిలో ఓ గన్ పట్టుకుని నెట్‌ఫ్లిక్స్‌కు వార్నింగ్ ఇచ్చిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘‘చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్‌.. రానా నాయుడులో హీరో ఎవరు? నేను.. అందరికంటే పెద్ద స్టార్‌ ఎవరు? నేను.. అందంగా కనిపించేది నేనే, ఫ్యాన్స్‌ కూడా నా వాళ్లే! కాబట్టి షోకి రానా నాయుడు కాదు నాగా నాయుడు అని ఉండాలి. నాతో మజాక్‌లొద్దు..’’ అంటూ వెంకీ వార్నింగ్ ఇచ్చిన వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

Venkatesh: వెంకీ ల్యాండ్‌మార్క్ మూవీలో కేజీయఫ్ భామ.. నిజమేనా?

ఈ వీడియోలో వెంకీ గెటప్ సూపర్బ్‌గా ఉందంటూ అభిమానులు ఈ వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ గతంలోనే వెల్లడించింది.