F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్3’ మరో వారం రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను గతంలో వచ్చిన ఎఫ్2కు సీక్వెల్‌గా దర్శకుడు....

F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!

Venkatesh Triples His Remuneration From F2 To F3

F3: యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్3’ మరో వారం రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను గతంలో వచ్చిన ఎఫ్2కు సీక్వెల్‌గా దర్శకుడు తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్2 కంటే కూడా ఎఫ్3లో కామెడీ డోస్‌ను రెట్టింపు చేశాడట ఈ డైరెక్టర్. అటు ఎఫ్2లో నటించిన మెజారిటీ యాక్టర్స్ ఈ సీక్వెల్‌లోనూ నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!

ఎఫ్2లో ఈ ఇద్దరు హీరోలు చేసిన హంగామా మామూలుగా లేదు. అయితే ఇప్పుడు అంతకు ట్రిపుల్ ఫన్ ఈ ఎఫ్3 సినిమాలో చేశారట ఈ ఇద్దరు హీరోలు. ఇక ఇప్పుడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎఫ్2 సినిమా కోసం గతంలో వెంకటేష్ రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడట. అయితే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీ కోసం నిర్మాత దిల్ రాజు ఆర్టిస్టుల రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదట. వారు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చినట్లు తెలుస్తోంది.

Dil Raju : ‘F3’ సినిమాకి టికెట్ రేట్లు పెంచం.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..

ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ ఎఫ్3 చిత్రం కోసం తన రెమ్యునరేషన్‌ను ఏకంగా మూడింతలు చేసినట్లుగా తెలుస్తోంది. ఎఫ్2‌లో డబుల్ కామెడీ అందించిన వెంకీ, ఇప్పుడు ఎఫ్3‌లో ట్రిపుల్ కామెడీని అందిస్తూ.. ట్రిపుల్ రెమ్యునరేషన్ పుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా నటీనటులు కూడా ఈ సీక్వెల్ మూవీ కోసం భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మే 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.