F3 Movie : కుర్రాడు బాబోయ్.. స్టేజిపై స్టెప్పులేసిన వెంకటేష్, వరుణ్, అనిల్ రావిపూడి..

సక్సెస్ మీట్ లో భాగంగా F3 సినిమాలో ఉన్న డీజే సాంగ్ కుర్రాడు బాబోయ్ పాటకు వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ స్టెప్పులు వేసి అలరించారు. హీరోలు ఇలా మాస్ డ్యాన్సులు.........

F3 Movie :  కుర్రాడు బాబోయ్.. స్టేజిపై స్టెప్పులేసిన వెంకటేష్, వరుణ్, అనిల్ రావిపూడి..

Venkatesh Dance

F3 Movie :   వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, మెహరీన్, తమన్నా, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన F3 సినిమా దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తుంది. హిట్ టాక్ తో దూసుకుపోతున్న F3 సినిమా ఇప్పటికే 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.

ఇక ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్, సక్సెస్ మీట్స్ కూడా నిర్వహిస్తూ జనాల్ని మరింతగా థియేటర్స్ కి రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా F3 సినిమా సక్సెస్ మీట్ వైజాగ్ లో నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. అయితే ఈ సక్సెస్ మీట్ లో వెంకటేష్, వరుణ్, అనిల్ రావిపూడి డ్యాన్సులు వేయడం విశేషం.

Anasuya : భర్తతో లిప్‌కిస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ.. మాల్దీవ్స్‌లో భర్తతో కలిసి అనసూయ పెళ్లి రోజు..

ఈ సక్సెస్ మీట్ లో భాగంగా F3 సినిమాలో ఉన్న డీజే సాంగ్ కుర్రాడు బాబోయ్ పాటకు వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ స్టెప్పులు వేసి అలరించారు. హీరోలు ఇలా మాస్ డ్యాన్సులు వేయడంతో ఆ ప్రాంగణం అంతా అరుపులతో, విజిల్స్ తో నిండిపోయింది. వెంకీ మామ డ్యాన్స్ చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.