Venkatesh : రానా నాయుడు సిరీస్ గతం.. వెంకటేష్ వైరల్ కామెంట్స్!

రానా నాయుడు గురించి వెంకటేష్ ని ప్రశ్నించగా.. గతం గతః అంటూ సమాధానం చెప్పడానికి నిరాకరించాడు.

Venkatesh : రానా నాయుడు సిరీస్ గతం.. వెంకటేష్ వైరల్ కామెంట్స్!

Venkatesh viral comments on Rana Naidu series at Ahimsa press meet

Venkatesh – Rana Naidu : దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా (Rana Daggubati) కలిసి నటించిన సిరీస్ రానా నాయుడు. హాలీవుడ్ సిరీస్ రే డొనోవన్ (Ray Donovan) కి ఇది అఫీషియల్ అడాప్షన్ గా తెరకెక్కింది. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ పూర్తి అడల్ట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక టాలీవుడ్ లో వెంకటేష్ కి ఎటువంటి ఇమేజ్ ఉందో అందరికి తెలుసు. ఫ్యామిలీ హీరోగా ఎన్నో సూపర్ హిట్టులు అందుకున్నాడు వెంకటేష్. అలాంటి హీరోని అలాంటి సిరీస్ లో తెలుగు ప్రేక్షకులు వెంకటేష్ ని చూడలేకపోయారు.

BRO: బ్రో నుంచి మ‌రో క్రేజీ అప్డేట్‌

దీంతో ఆ సిరీస్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. సెలబ్రెటీస్ సైతం రానా నాయుడు ఒక బూతు చిత్రం అంటూ వ్యాఖ్యానించారు. అయితే దీని పై వెంకటేష్ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా రానా తమ్ముడు అభిరామ్ (Abhiram) హీరోగా పరిచయం అవుతూ చేస్తున్న అహింస (Ahimsa) సినిమా ప్రెస్ మీట్ కి హాజరయిన వెంకటేష్ ని ఈ విషయం గురించి ప్రశ్నించారు. రానా నాయుడు ఫీడ్ బ్యాక్ మీ వరకు వచ్చిందా? దాని పై రియాక్షన్ ఏంటి? అని క్యూస్షన్ చేశారు.

Venkatesh : ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు.. లేదంటే లేదు.. నంది అవార్డులపై వెంకటేష్ కామెంట్స్!

అయితే ముందుగా సమాధానం చెప్పడానికి నిరాకరించిన వెంకటేష్.. గతం గతః అంటూ ముగించే ప్రయత్నం చేశాడు. అయితే విలేకర్లు తిరిగి ప్రశ్నించగా, వెంకటేష్ బదులిస్తూ.. “రానా నాయుడుకి వచ్చిన రెస్పాన్స్ కి నెట్‌ఫ్లిక్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అయితే మీరన్న ఫీడ్ బ్యాక్ మా వరకు వచ్చింది. అయితే అది గతం, అయ్యిపోయింది. ఇప్పుడు సెకండ్ సీజన్ లో మళ్ళీ అటువంటి ఫీడ్ బ్యాక్ రాకుండా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాము. ఈసారి ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఈ సిరీస్ నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సెకండ్ సీజన్ లో అడల్ట్ కంటెంట్ లేకుండా తెరకెక్కిస్తున్నారని వెంకీ మామ క్లారిటీ ఇచ్చేశాడు.