Venky Atluri : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. సందడి చేసిన కీర్తి సురేష్, నితిన్..

తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిపించుకున్న వెంకీ అట్లూరి.. ఏడడుగులు వేస్తూ వివాహ బంధంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. పూజ అనే అమ్మాయి మేడలో నేడు కుటుంబసభ్యుల మధ్య మూడుముళ్లు వేశాడు ఈ దర్శకుడు.

Venky Atluri : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. సందడి చేసిన కీర్తి సురేష్, నితిన్..

Venky Atluri

Venky Atluri : టాలీవుడ్ లో హీరోగా కెరీర్ మొదలుపెట్టి, తరువాత కథ, పాటల రచయితగా పెన్ను పట్టుకొని, చివరికి డైరెక్టర్ చైర్ లో సెటిల్ అయిన దర్శకుడు ‘వెంకీ అట్లూరి’. 2010లో వచ్చిన ‘స్నేహం గీతం’ సినిమాలో సందీప్ కిషన్ తో కలిసి మరో హీరోగా స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకీ.. ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’, ‘కేరింత’ సినిమాలకు రైటర్‌గా, లిరిక్ రైటర్‌గా పని చేశాడు. ఆ తరువాత వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమాతో డైరెక్టర్‌గా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక దర్శకుడిగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న వెంకీ.. మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం తమిళ హీరో ధనుష్ తో ‘సార్’ అనే సినిమా చేస్తూ తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు.

Tollywood : తమిళ సినిమా గురించి వెనక్కి తగ్గుతున్న తెలుగు సినిమాలు..

తాజాగా ఈ దర్శకుడు ఏడడుగులు వేస్తూ వివాహ బంధంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. పూజ అనే అమ్మాయి మేడలో నేడు కుటుంబసభ్యుల మధ్య మూడుముళ్లు వేశాడు ఈ దర్శకుడు. హైదరాబాద్ జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నితిన్, తన భార్య షాలినితో కలిసి హాజరయ్యాడు. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. ‘కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వెంకీ స్వామికి కంగ్రాట్స్. పూజతో నీ జీవితం మరెంత అందంగా మారాలి’ అంటూ ట్వీట్ చేశాడు.

ఇక ఈ వేడుకకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా వచ్చింది. వధూవరులతో ఫోటోలు దిగి సందడి చేసింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ న్యూ కపుల్ కి కంగ్రాట్స్ తెలియజేసింది. గతంలో కీర్తి, నితిన్ కలిసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాలో నటించారు. కాగా ప్రస్తుతం వెంకీ డైరెక్ట్ చేసిన ‘సార్’ సినిమా ఈ నెల 17న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ మూవీలో ధనుష్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.