Drushyam 2 Telugu: అమెజాన్‌లో వచ్చేసిన వెంకీ మరో దృశ్యం!

ఓ మర్డర్ మిస్టరీ.. సౌత్ మొత్తం రీమేక్ అయ్యింది. అంతేకాదు నార్త్‌లో కూడా రీమేక్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా తెలుగులో తెరకెక్కిన దృశ్యం 2 ఓటీటీలో రిలీజ్..

10TV Telugu News

Drushyam 2 Telugu: ఓ మర్డర్ మిస్టరీ.. సౌత్ మొత్తం రీమేక్ అయ్యింది. అంతేకాదు నార్త్‌లో కూడా రీమేక్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా తెలుగులో తెరకెక్కిన దృశ్యం 2 ఓటీటీలో రిలీజ్ అన్నా కూడా జనాలు అంతే ఇంట్రస్టింగ్‌గా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూశారు. థియేటర్లా.. ఓటీటీనా అంటూ కొన్ని రోజులుగా ఊరించిన దృశ్యం 2 ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేసింది.

Akhanda: ఎన్నో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్‌తో అఖండ!

దృశ్యం 2 సినిమాని నెలరోజుల్లో కంప్లీట్ చేశారు. అది కూడా కరోనా టైమ్‌లో. ఇంకేముంది.. అంతే ఫాస్ట్‌గా రిలీజ్ కూడా అనుకన్నారు అందరూ. కానీ ఆడియన్స్ అసలు ఆ సినిమా గురించి మర్చిపోయే టైమ్‌లో సినిమా రిలీజ్ ఓటీటీలో అని అనౌన్స్ చేశారు. అయినా సరే ఆడియన్స్ మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా దృశ్యం 2 కోసం వెయిట్ చేశారు.

Shiva Shankar Master : ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ శివశంకర్ మాస్టర్‌కు కరోనా… ఆరోగ్యం విషమం

సీనియర్ హీరో వెంకటేష్.. జీతూ జోసెఫ్ డైరెక్షన్లో మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన దృశ్యం మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం 2 సినిమా నవంబర్ 25నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ‌లో అవైలబుల్‌గా వచ్చేసింది. మళయాళ దృశ్యం 2కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకి ఫస్ట్ నుంచి క్రేజ్ ఉంది. ఆల్రెడీ ఈ సినిమా మళయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయినా కూడా తెలుగు సినిమాకి కూడా అదే రెస్పాన్స్ అందుకుంటున్నారు టీమ్.

Movie Theatres : ఏపీలో పెద్ద సినిమాలకు ఎఫెక్ట్..

వెంకటేష్, మీనా, నదియా లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన దృశ్యం 2 సినిమా ఫస్ట్ పార్ట్‌కి మించిన ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఆల్రెడీ ఇంతకుముందు నారప్ప సినిమాని రిలీజ్ చేసిన వెంకటేష్.. ఇప్పుడు దృశ్యం 2ని కూడా ఓటీటీలోనే అన్నారు. అయినా సరే ఫ్యాన్స్ ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఈసినిమాకున్న క్రేజ్‌ని కంటిన్యూ చేశారు. వెంకటేష్ కెరీర్‌లో మరో మంచి హిట్‌ని యాడ్ చేశారు.