మొదటిరోజు మామా అల్లుళ్లు అదరగొట్టారుగా!

‘వెంకీ మామ’ - కలెక్షన్ల పరంగా మొదటిరోజు మామా అల్లుళ్లు రికార్డ్ క్రియేట్ చేశారని చెప్తున్నాయి చిత్ర వర్గాలు..

10TV Telugu News

‘వెంకీ మామ’ – కలెక్షన్ల పరంగా మొదటిరోజు మామా అల్లుళ్లు రికార్డ్ క్రియేట్ చేశారని చెప్తున్నాయి చిత్ర వర్గాలు..

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన సినిమా.. ‘వెంకీ మామ’.. వెంకీతో పాయల్ రాజ్‌పుత్, చైతుతో రాశీఖన్నా జతకట్టగా.. బాబీ దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘వెంకీ మామ’.

 

నిజ జీవితంలో ఉన్న రిలేషన్‌ని స్క్రీన్‌పై కూడా ప్రెజెంట్ చేస్తూ సినిమాలు తీస్తే కాస్త కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్ల పరంగానూ మొదటిరోజు మామా అల్లుళ్లు రికార్డ్ క్రియేట్ చేశారని చెప్తున్నాయి చిత్ర వర్గాలు. ఈ చిత్రానికి తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.76 కోట్ల వసూళ్లు వచ్చాయని, మిగతా అన్ని ప్రాంతాల్లోని కలెక్షన్లు కూడా కలుపుకుంటే ఇది దాదాపు రూ.7.40 కోట్లుగా ఉన్నట్లు లెక్క తేలిందట.

 

వెంకటేష్‌, నాగచైతన్య సినీ కెరీర్‌లో తొలిరోజు దక్కిన అత్యధిక వసూళ్లు ఇవేనని చిత్రసీమ వర్గాలు చెబుతున్నాయి. ఏరియాల పరంగా చూసుకుంటే ఈ చిత్రానికి ‘నైజాం : (రూ.2.29కోట్లు)’, ‘సీడెడ్‌ : ‘రూ.1.60 కోట్లు)’, ‘ఉత్తరాంధ్ర : (రూ.0.87కోట్లు) ప్రాంతాల నుంచే అత్యధిక వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ చిత్రంకు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ వారాంతంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Image

10TV Telugu News