Vennela Kishore: ఇండియన్ 2 లేదు.. పాకిస్థాన్ 3 లేదు.. అంటూ వెన్నెల కిషోర్ క్లారిటీ!
టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ చేసే కామెడీకి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఆయన చేసే కామెడీని ఎంజాయ్ చేసే ఆడియెన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌కు ఫిదా అవుతుంటారు. ఇక ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఈ కమెడియన్ ప్రయత్నిస్తుంటాడు.

Vennela Kishore Denies Rumours About Acting In Indian 2
Vennela Kishore: టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ చేసే కామెడీకి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఆయన చేసే కామెడీని ఎంజాయ్ చేసే ఆడియెన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌కు ఫిదా అవుతుంటారు. ఇక ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఈ కమెడియన్ ప్రయత్నిస్తుంటాడు.
Indian 2 : సౌత్ ఆఫ్రికాకు పయనమైన లోకనాయకుడు.. ఇండియన్ 2 షెడ్యూల్..
అయితే, తాజాగా వెన్నెల కిషోర్ ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఇండియన్-2’లో వెన్నెల కిషోర్ ఓ నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఓ అభిమాని ఈ వార్తకు సంబంధించి వెన్నెల కిషోర్‌ను సోషల్ మీడియా వేదికగా, ఇది నిజమా అంటూ ప్రశ్నించాడు. ఇక దీనికి రిప్లై ఇస్తూ వెన్నెల కిషోర్ తనదైన మార్క్ కామెడీని చేశాడు.
తాను ఇండియన్-2లో లేనని.. పాకిస్థాన్-3 లోనూ లేనని ఆయన క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి తనపై వచ్చిన రూమర్‌ను ఈ విధంగా కామెడీ పంచ్‌తో క్లారిటీ ఇచ్చి అందరినీ నవ్విస్తున్నాడు వెన్నెల కిషోర్. ఇక ఆయన ప్రస్తుతం తెలుగులోనే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నట్లుగా తెలిపాడు.
Indian 2 lo lenu Pakistan 3 lo lenu pic.twitter.com/gJUmmoO9GG
— vennela kishore (@vennelakishore) February 28, 2023