Venu : బలగం వివాదంపై డైరెక్టర్ వేణు ప్రెస్‌మీట్.. జరిగింది ఒకటి.. మీడియాకి చెప్పింది ఒకటి.. ఇవన్నీ చిల్లర పనులు..
వేణు ఈ వివాదంపై మాట్లాడుతూ.. అయన చెప్పిన కథ అయన చెప్పేదాకా కూడా నేను చదవలేదు, చూడలేదు. మా నాన్న, పెదనాన్న, బాబాయ్ లు ఇలా చాలా పెద్ద కుటుంబం మాది. మా నాన్న చనిపోయినప్పుడు మా కుటుంబం అంతా................

Venu : ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు మొదటిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఈ సినిమాని నియమించింది. ఈ సినిమాకి ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా చేశారు. బలగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంత్రి KTR కూడా విచ్చేసి చిత్రయూనిట్ ని అభినందించారు. బలగం సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ అయింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా చాలా బాగుంది అని అంటున్నారు
అయితే శనివారం నాడు గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి… బలగం సినిమా కథ నాదే. ఈ కథని నేను 2011లోనే రాసుకున్నాను. ఈ కథ 2014లో పచ్చికి పేరుతో నమస్తే తెలంగాణ బతుకమ్మలో ప్రింట్ అయింది. తెలంగాణ ఉద్యమం రోజుల్లో మా తాత చనిపోతే పిట్టకి ముట్టలేదు. అప్పుడు అదే కథలా రాసుకున్నా. ఈ కథని చూసే నాకు నమస్తే తెలంగాణలో ఉద్యోగం ఇచ్చారు. ఈ కథ 100% నాదే. ఇందులో మూడు పాటలు, నాలుగు జోక్స్ యాడ్ చేసి వాళ్ళ పేర్లు వేసుకున్నారు. దీనిపై నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఈ రోజు దిల్ రాజు ఆఫీస్ కి పిలిపించుకొని గంటసేపు మాట్లాడాడు. ఈ కథ వేణుకి ఎవరో చెప్పారు అంట అని నాతో దిల్ రాజు చెప్పాడు. నా కథకు, నాకు న్యాయం జరగాలి. ఈ సినిమాలో ఈ కథ నాదే అని పేరు వేయాలి. మా న్యాయవాదిని కలిసి లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. అవకాశం వస్తే కేటీఆర్ ని కలుస్తాను. నాకు కథ రాసుకోవడమే తెలుసు కాపీ కొట్టడం తెలీదు. నేనేమి డబ్బుకోసం ఇదంతా చేయట్లేదు అని వ్యాఖ్యలు చేశారు.
తాజాగా దీనిపై వేణు ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. వేణు ఈ వివాదంపై మాట్లాడుతూ.. అయన చెప్పిన కథ అయన చెప్పేదాకా కూడా నేను చదవలేదు, చూడలేదు. మా నాన్న, పెదనాన్న, బాబాయ్ లు ఇలా చాలా పెద్ద కుటుంబం మాది. మా నాన్న చనిపోయినప్పుడు మా కుటుంబం అంతా వచ్చి సపోర్ట్ చేశారు. మా మీద ప్రేమ చూపించారు. ఏడ్చారు, పనులు చేశారు. చావు దగ్గర అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇది నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగింది. ఆ సంఘటన నాకు బలంగా గుర్తుండిపోయింది. మా ఇంకో పెదనాన్న చనిపోయాక, పెద్దమ్మ చనిపోయాక వెళ్లలేకపోయా షూటింగ్స్ లో ఉండి. దానికి మా అన్న బాధపడ్డాడు. ఈ విషయంలో అప్పట్నుంచి ఈ కథ రాయాలి అనుకున్నాను. మా చుట్టాలు ఇంకొకరు చనిపోతే తెలంగాణ బుడగ జంగాలు వచ్చి మా మీద పాటలు పాడారు. అందరూ ఏడ్చారు.
మా ఇంట్లో చూసిన అన్ని చావులు చూసి, కాకులు పిండాలు తినడం.. ఇవన్నీ మనకు ఎప్పట్నుంచో ఉంది. ఎవ్వరు కనిపెట్టలేదు. ఎవ్వరి సొత్తు కాదు. దీని మీద సినిమా రాద్దామని ఫిక్స్ అయినప్పుడు నేను కమెడియన్ కాబట్టి అప్పటివరకు రాసిన కామెడీ కథలు పక్కన పెట్టి ఈ కథ మీద కూర్చున్న. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ నా ఫ్రెండ్. ఈ కథ విని సూపర్ అని చెప్పి నాకు రైటింగ్ లో సపోర్ట్ చేశాడు. అనుదీప్, నేను కలిసి కొన్ని పల్లెటూళ్ళు తిరిగి ఈ కథ మీద రీసెర్చ్ చేశాం. ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్పారు. అసలు ఇది కథ కాదు, మన ఇళ్లల్లో జరిగే సంఘటనలు. ఫైనల్ సాంగ్ కోసం తెలంగాణ బుడగ జంగాల దగ్గర రీసెర్చ్ చేసి మరీ పాడించాం. సినిమా క్లైమాక్స్ చూసి చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఇది ఎవరి కథ కాదు. అందరి ఇళ్లల్లో జరిగే సంప్రదాయం. సాంప్రదాయాలను నాది అంటే ఎలా. సాంప్రదాయాలు మన అందరివీ. దీని మీద ఎవరైనా రాసుకోవచ్చు. ఇలాంటి కథల మీద ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి. కానీ వారెవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో కూడా చాలా సినిమాలు వస్తాయి. నేను కూడా మాట్లాడాను. ఎందుకంటే దీని మీద ఎవరైనా సినిమా తీయొచ్చు. ఇది మన సాంప్రదాయం. మీకు అంతగా ఉంటే రైటర్స్ అసోసియేషన్ కి వెళ్లి మాట్లాడమనండి. కావాలంటే వాళ్ళే చెప్తారు రెండు కథలను చూసి. చిల్లర పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ మన తెలంగాణ సినిమాని బయటకి తీసుకొస్తే ఇలా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఈ కథ రాసింది నేను, నన్ను అడగాలి. దిల్ రాజు గారిని కాదు. ఆయనని అభాసుపాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఒక పేజీ కథ – 100 పేజీల కథ ఒకటేనా.
Balagam : బలగం మూవీ కథ నాదే అంటూ మీడియా ముందుకొచ్చిన జర్నలిస్ట్.. డైరెక్టర్ వేణు ఏమంటాడో??
ఆయన కథలో పర్యావరణం పాడైపోయి కాకులు రాలేదు. కానీ ఇందులో కథ ఏంటి, సినిమా చూసిన వాళ్లకు తెలుసు. ఈ కథని ఎవరైనా సినిమా తీయొచ్చు. ఇది చిల్లర బ్లాక్ మెయిల్. మూల కథ నాది అన్నాడు. దిల్ రాజుని కలవడానికి అందర్నీ అడుక్కొని కలిసి మాట్లాడి బయట వేరేది చెప్పాడు మీడియా ముందు. ఇది చాలా తప్పు. నమస్తే తెలంగాణాలో పనిచేస్తున్నావు అన్నాడు. అదే పేపర్లో నా సినిమా గురించి బాగా రాసారు. మరి నువ్వు చెప్పింది ఎవరూ రాయలేదు. నిజంగా దమ్ముంటే మంచి కథ రాసుకొని దిల్ రాజు దగ్గరకు వెళ్ళండి సినిమా తీస్తారు. అయన కూడా ఓకే అన్నారు అని వేణు ఫైర్ అయ్యాడు. మరి దీనిపై గడ్డం సతీష్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.