రవితేజ 66లో సముద్రఖని

రవితేజ 66లో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని నటించనున్నారు..

  • Published By: sekhar ,Published On : November 7, 2019 / 06:04 AM IST
రవితేజ 66లో సముద్రఖని

రవితేజ 66లో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని నటించనున్నారు..

మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హీరోగా రవితేజకిది 66వ సినిమా.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అయ్యాడు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటించనుంది..

ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని నటించనున్నారు. ‘శంభో శివ శంభో’ లో చిన్న పాత్రలో కనిపించిన సముద్రఖని ఆ తర్వాత ‘రఘువరన్.. B.Tech’లో తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు.. తెలుగులో తొలిసారిగా రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ చిత్రంలో నటిస్తున్నారాయన..

Read Also : ఫ్యామిలీతో కమల్ బర్త్‌డే సెలబ్రేషన్స్

రవితేజ 66 కోసం దర్శక, నిర్మాతలు సంప్రదించగా.. తన పాత్ర నచ్చడంతో సముద్రఖని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు..