Pathaan: మోదీ వ్యాఖ్యల ఎఫెక్ట్? పఠాన్ సినిమాపై నిరసన విరమించుకున్న వీహెచ్‭పీ

పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట విడుదలతో కాంట్రవర్సీ ప్రారంభమైంది. ఈ పాటలో నటి దీపిక పదుకోన్ కాషాయం రంగు బట్టలు వేసుకోవడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున దీనిపై స్పందించారు. ఈ సినిమాను తమ రాష్ట్రంలో విడుదల అవ్వడం కూడా కష్టమేనని మధ్య ప్రదేశ్ హోంమంత్రి వ్యాఖ్యానించారు

Pathaan: మోదీ వ్యాఖ్యల ఎఫెక్ట్? పఠాన్ సినిమాపై నిరసన విరమించుకున్న వీహెచ్‭పీ

VHP withdraws protest against Shah Rukh Khan’s ‘Pathaan’

Pathaan: కొద్ది రోజులుగా పఠాన్ సినిమాకు బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విశ్వహిందూ పరిషత్.. ఉన్నట్టుండి నిరసన విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఏమైతేనేమి పఠాన్ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు ఈ నిరసన విరమించుకోవడం గమనార్హం. అయితే దీనికి గల కారణాలను వీహెచ్‭పీ వెల్లడించింది. తాము చేసిన మార్పులను అంగీకరించడం వల్లే నిరసన విరమిస్తున్నట్లు గుజరాత్ వీహెచ్‭పీ సెక్రెటరీ అశోక్ రావల్ మంగళవారం చెప్పారు. అయితే అనవసరపు రాద్దాంతం అవసరం లేదని, ముస్లింలకు దగ్గరవ్వాలంటూ ఈ మధ్యే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన దీనికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

James Cameron : ఆ రికార్డు సాధించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఒక్కడే..

పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట విడుదలతో కాంట్రవర్సీ ప్రారంభమైంది. ఈ పాటలో నటి దీపిక పదుకోన్ కాషాయం రంగు బట్టలు వేసుకోవడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున దీనిపై స్పందించారు. ఈ సినిమాను తమ రాష్ట్రంలో విడుదల అవ్వడం కూడా కష్టమేనని మధ్య ప్రదేశ్ హోంమంత్రి వ్యాఖ్యానించారు. అనేక మంది బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్పులు సూచించారు. అయితే దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సీబీఎఫ్‭సీ) స్పందించి తగిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సుమారు 40 నుంచి 45 వరకు మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.

Chiranjeevi : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై నో కామెంట్స్ అంటున్న చిరంజీవి..