Viashnav Tej : కేతికతో ‘రంగరంగ వైభవంగా’ వైష్ణవ్ తేజ్..

తాజాగా తన మూడో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసాడు పంజా వైష్ణవ్ తేజ్. ఇవాళ ఈ సినిమా టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్ తో వైష్ణవ్.......

Viashnav Tej : కేతికతో ‘రంగరంగ వైభవంగా’ వైష్ణవ్ తేజ్..

Vaishnav Tej

Viashnav Tej:  మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. మొదటి సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వరుసగా సినిమాలు ఒప్పుకున్నాడు వైష్ణవ్. రెండవ సినిమాగా ‘కొండపొలం’తో రాగా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా అందులో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. తాజాగా తన మూడో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసాడు పంజా వైష్ణవ్ తేజ్.

Suriya : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్.. త్వరలో ప్రకటన..

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమాని ఇటీవల అనౌన్స్ చేశారు. ఇవాళ ఈ సినిమా టైటిల్ లాంచ్ టీజర్ ని రిలీజ్ చేశారు. ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ తో వైష్ణవ్ రాబోతున్నాడు. ఇందులో వైష్ణవ్ సరసన రొమాంటిక్ సినిమాతో కుర్రకారుకి మత్తెక్కించిన కేతిక శర్మ నటించనుంది. టైటిల్ తో ఉన్న ఈ టీజర్ లో కేతిక, వైష్ణవ్ మధ్య మంచి రొమాంటిక్ సీన్ ని, డైలాగ్స్ ని కూడా చూపించారు. దీంతో ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.