Narappa : ‘నారప్ప’ థియేటర్లలోకే వస్తున్నాడప్పా..

‘విక్టరీ’ వెంకటేష్, ప్రియమణి నటించిన ‘నారప్ప’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది..

Narappa : ‘నారప్ప’ థియేటర్లలోకే వస్తున్నాడప్పా..

Narappa

Narappa: హీరో వెంకటేష్ తన దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో, క్లాస్, మాస్ హీరోగా, మహిళాభిమానుల ఆదరణతో విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్నారు. వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నార‌ప్ప‌’. ధనుష్ నటించిన సూపర్ హిట్ తమిళ్ మూవీ ‘అసురన్’ కి తెలుగు రీమేక్ ఇది. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

NARAPPA

విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో ‘నార‌ప్ప’ భార్య ‘సుందరమ్మ’ గా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లింప్స్, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన ‘నార‌ప్ప’ టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రలో వెంకీ తన అద్భుతమైన నటనతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌నున్నారు.

Arjun Sarja : అర్జున్ నిర్మించిన ‘ఆంజనేయస్వామి గుడి’.. జూలై 1న ‘మహా కుంభాబిషేకం’..

అలాగే వెంకటేష్‌ను ఇంత‌వ‌ర‌కూ మ‌నం చూడ‌ని ఒక కొత్త‌ అవతారంలో చూపించ‌నున్నారు ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయ‌న మేకింగ్ ఈ సినిమాకి బిగ్ అసెట్ కానుందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ వస్తున్న వార్తలు నిజం కాదని, ప్రేక్షకులను ‘నారప్ప’ థియేటర్లలోనే కలుస్తాడని కన్ఫమ్ చేశారు నిర్మాతలు.