Viduthalai Movie: ఒకేసారి తమిళ్, తెలుగులో రిలీజ్ కాబోతున్న వెట్రిమారన్ ‘విడుతలై-1’ మూవీ!
తమిళ వర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలు రియాలిస్టిక్‌గా ఉంటాయనే ముద్ర తమిళ ఆడియెన్స్‌లో ఉంది. అందుకే ఆయన ఒక సినిమా చేస్తున్నాడంటే, ఆ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. వెట్రిమారన్ సినిమాలకు ఇతర భాషల్లోనూ ఆడియెన్స్ ఉన్నారంటే, ఆయన తెరకెక్కించే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Viduthalai Movie: తమిళ వర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలు రియాలిస్టిక్‌గా ఉంటాయనే ముద్ర తమిళ ఆడియెన్స్‌లో ఉంది. అందుకే ఆయన ఒక సినిమా చేస్తున్నాడంటే, ఆ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. వెట్రిమారన్ సినిమాలకు ఇతర భాషల్లోనూ ఆడియెన్స్ ఉన్నారంటే, ఆయన తెరకెక్కించే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Vetri Maaran : నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో దళపతి విజయ్
ఇక ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘విడుతలై-1’ ఇప్పటికే కోలీవుడ్‌లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కామెడీ యాక్టర్ సూరి ప్రధాన పాత్రలో ఈ సినిమా వస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Vetrimaaran : నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..!
విడుతలై సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ బ్యానర్ ఈ చిత్ర తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి క్రియేట్ అవుతోంది. మరి విడుతలై మూవీని తెలుగులో నిజంగానే రిలీజ్ చేస్తారా అనే విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.