Vidya Balan : మాల్దీవ్స్‌లో రోడ్డు మీద డ్రమ్స్ వాయిస్తున్న స్టార్ హీరోయిన్.. ఈ వీడియో చూశారా??
తాజాగా బాలీవుడ్(Bollywood) భామ విద్యాబాలన్(Vidya Balan) తన కొత్త ట్యాలెంట్ ని బయట పెట్టింది. విద్యాబాలన్ మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్ళింది. అక్కడా డ్రమ్స్ లో నగడా అనే వాయిద్య పరికరాన్ని నేర్చుకుంది.

Vidya Balan playing Musical Instrument Nagada at Maldives
Vidya Balan : మన సినిమా సెలబ్రిటీల్లో ఉన్న వేరే ట్యాలెంట్స్ ని అప్పుడప్పుడు బయటకు తీస్తూ ఉంటారు. యాక్టింగ్ కాకుండా చాలామందికి ఇంకో ట్యాలెంట్ ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్(Bollywood) భామ విద్యాబాలన్(Vidya Balan) తన కొత్త ట్యాలెంట్ ని బయట పెట్టింది. 20 ఏళ్లుగా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది విద్యా బాలన్. వివిధ జోనర్స్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పించింది.
తాజాగా విద్యాబాలన్ మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్ళింది. అక్కడా డ్రమ్స్ లో నగడా అనే వాయిద్య పరికరాన్ని నేర్చుకుంది. మాల్దీవ్స్ లో రోడ్ పక్కన తనకి నగడా నేర్పిన బ్యాండ్ ప్రోగ్రాం ఇస్తుంటే వారితో కలిసి నగడాని అద్భుతంగా వాయించింది. అచ్చం ఒక ప్రొఫెషనల్ డ్రమ్మర్ వాయిస్తున్నట్టే విద్యా బాలన్ డ్రమ్స్ వాయించింది. బ్యాండ్ తో కలిసి తాను నగడాని వాయిస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. కొత్తగా ఏదైనా నేర్చుకోడానికి ఎప్పుడూ సరైన సమయమే అని పోస్ట్ చేసింది. అలాగే తనకు నగడా వాయించేందుకు అవకాశం ఇచ్చిన ప్రముఖ నగడా వాయిద్యకారుడు సోలంకి కి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసింది విద్యాబాలన్.
దీంతో విద్యాబాలన్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అచ్చం ప్రొఫెషనల్స్ లాగే వాయిస్తున్నావంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది స్టార్ హీరోయిన్స్, నటీనటులు మాల్దీవ్స్ కి వెళ్తే అక్కడ బీచ్ లలో బోల్డ్ ఫోటోలు దిగి షేర్ చేస్తుంటే విద్యా మాత్రం ఇలా ఓ మంచి వీడియోని షేర్ చేయడంతో నగడా అద్భుతంగా వాయించినందుకు మాత్రమే కాకుండా ఈ విషయంలో కూడా అభినందిస్తున్నారు.