బాలీవుడ్ యాక్షన్ హీరో ‘విద్యుత్ జమ్వాల్’ ట్రెండ్ సెట్ చేశాడుగా..!

  • Published By: sreehari ,Published On : July 21, 2020 / 07:51 PM IST
బాలీవుడ్ యాక్షన్ హీరో ‘విద్యుత్ జమ్వాల్’ ట్రెండ్ సెట్ చేశాడుగా..!

బాలీవుడ్ యాక్షన్ స్టార్ హీరో విద్యుత్ జమ్వాల్ మరో ఘనత సాధించాడు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న జమ్వాల్.. తన స్టంట్లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఫిట్ అండ్ ఫ్యాబ్ లుకింగ్‌లో కనిపించే విద్యుత్.. ‘10 పీపుల్ యు డోంట్ వాంట్ టు మెస్ విత్’ ప్రపంచ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
Vidyut Jammwal makes it to '10 People You Don't Want To Mess With' in the world list!ఇప్పుడు ప్రపంచ జాబితాలో తన పేరు చేరడంతో మరోసారి అంతర్జాతీయ స్థాయిలో జమ్వాల్ ట్రెండింగ్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా విద్యుత్ జామ్వాల్ పేరు ట్రెండింగ్ అవుతోంది.

ప్రపంచ 10 గౌరవనీయ జాబితాలో చేరిన వారిలో జమ్వాల్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా చేరారు. జమ్వాల్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ది రిచెస్ట్ రచించిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ హోస్ట్ బేర్ గ్రిల్స్ కూడా ఉన్నారు.

తనదైన యాక్షన్ మూవీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. రిస్కీ స్టంట్లతో ఆడియోన్స్‌ను మంత్ర ముగ్ధులను చేస్తుంటాడు. తెలుగులో వచ్చిన శక్తి, ఊసరవెల్లి మూవీల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితిడయ్యాడు.

విద్యుత్‌కు భారతీయ సంప్రదాయ పోరాట విద్య కలరియపట్టులో మంచి పట్టు ఉంది. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన జమ్వాల్.. తన సినిమాల్లోనే ఇదే కళతో విన్యాసాలను ప్రదర్శిస్తుంటాడు. తన 3 ఏళ్ల వయస్సు నుంచే భారతీయ మార్షల్ ఆర్ట్స్ రూపమైన కలరిపాయట్టును నేర్చుకోవడం ప్రారంభించాడు.

ప్రపంచ 10 గౌరవనీయ జాబితాలో విద్యుత్ జమ్వాల్ చోటు దక్కించుకున్నందుకు ప్రముఖ నటులంతా విషెస్ చెబుతున్నారు. మూవీ అనలిస్ట్ అతుల్ మోహన్ ట్వీట్ చేయగా, నటుడు జమ్వాల్ ‘థాంక్యూ జై హింద్’ అంటూ సమాధానం ఇచ్చారు.

ఫిజిక్, వాష్‌బోర్డ్ అబ్స్ అతనికి దేశ విదేశాలలో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. వర్క్ ఫ్రంట్‌లో, టిగ్‌మన్‌షు ధులియా ‘యారా’ ZEE5 ఒరిజినల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలో డిస్నీ + హాట్‌స్టార్‌లో ‘ఖుడా హాఫిజ్’ లో కూడా జమ్వాల్ కనిపించనున్నాడు.