Vijay: విజయ్ హిట్ సినిమా రీ-రిలీజ్.. ‘అదిరింది’గా!

తమిళ స్టార్ హీరో విజయ్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ నటించే సినిమాలకు ఇక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ దక్కుతుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వారిసు’ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా కంటే ముందే, విజయ్ నటించిన మరో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Vijay: విజయ్ హిట్ సినిమా రీ-రిలీజ్.. ‘అదిరింది’గా!

Vijay Adirindi Movie To Re-Release In Telugu

Vijay: తమిళ స్టార్ హీరో విజయ్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ నటించే సినిమాలకు ఇక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ దక్కుతుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వారిసు’ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా కంటే ముందే, విజయ్ నటించిన మరో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Vijay: విజయ్ సినిమాలో మరో తమిళ హీరో.. ఎవరంటే?

విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో 2017లో రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో విజయ్ ట్రిపుల్ రోల్‌లో నటించగా, అందాల భామలు సమంత, కాజల్, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు మళ్లీ రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. హీరో విజయ్ ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో డిసెంబర్ 4న ‘అదిరింది’ మూవీ స్పెషల్ షోలు వేస్తున్నారు.

తెలుగు హీరోల సినిమాలను ఇటీవల ఇక్కడ రీ-రిలీజ్ చేస్తుండగా, వాటికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. మరి తమిళ హీరో విజయ్ ‘అదిరింది’ సినిమాను తెలుగులో రీ-రిలీజ్ చేస్తుండటంతో, ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.