Vijay Antony : బిచ్చగాడు మహేష్ బాబుకి సూట్ అవుతుంది.. విజయ్ ఆంటోని వ్యాఖ్యలు వైరల్.. మహేష్ అభిమానులు ఏమన్నారో తెలుసా?

తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా బిచ్చగాడు 2 యూనిట్ తెలుగులో మీమర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ తో చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగా వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి బిచ్చగాడు సినిమా మీరు కాకపోతే ఇంకెవరు చేస్తే బాగుంటుంది అని అడిగాడు.

Vijay Antony : బిచ్చగాడు మహేష్ బాబుకి సూట్ అవుతుంది.. విజయ్ ఆంటోని వ్యాఖ్యలు వైరల్.. మహేష్ అభిమానులు ఏమన్నారో తెలుసా?

Vijay Antonay said Bichagadu Character suit to Mahesh Babu

Mahesh Babu:  2016లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు(Bichagadu) తెలుగులో భారీ విజయం సాధించింది. జస్ట్ 2 కోట్లతో డబ్బింగ్ రైట్స్ కొన్న బయ్యర్లకు ఏకంగా 15 కోట్లు కలెక్ట్ చేసి ఫుల్ గా లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమాతో హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) తెలుగులో బోల్డంత ఇమేజ్, క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్నారు. విజయ్ కెరీర్ నే మార్చేసిన బిచ్చగాడు కి సీక్వెల్ బిచ్చగాడు 2 మే 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. బిచ్చగాడు 2 లో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాక దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ భార్య నిర్మాతగా వ్యవహరించింది. ఇందులో కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు

తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా బిచ్చగాడు 2 యూనిట్ తెలుగులో మీమర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ తో చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగా వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి బిచ్చగాడు సినిమా మీరు కాకపోతే ఇంకెవరు చేస్తే బాగుంటుంది అని అడిగాడు.

Shruti Haasan : కాన్స్‌ ఫెస్టివల్‌లో శృతిహాసన్ ఆ అంశం పై చర్చ.. మళ్ళీ ‘వాల్తేరు వీరయ్య’ గురించి చెబుతుందా?

దీనికి విజయ్.. తెలుగులో అయితే మహేష్ బాబు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ పాత్రలోని హావభావాలను మహేష్ అద్భుతంగా పలికించగలరని నమ్మకం అని అన్నారు. ఇక తమిళ్ లో అయితే విజయ్ కానీ, అజిత్ కానీ సూట్ అవుతారని అన్నారు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా మహేష్ అభిమానులు ఆ పాత్రలో మహేష్ ని చూడలేం అంటున్నారు. కొంతమంది నెటిజన్లు అసలు మహేష్ ఆ పాత్రలు ఎలా సూట్ అవుతారు అంటూ ట్రోల్ చేస్తూ మీమ్స్ వేస్తున్నారు. ఇక త్వరలోనే డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేస్తానని విజయ్ ఆంటోనీ ప్రకటించారు.