Vijay Antony : ‘బిచ్చగాడు 2’ తో దర్శకుడిగా విజయ్ ఆంటోని..

‘బిచ్చగాడు 2’ తో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోని..

Vijay Antony : ‘బిచ్చగాడు 2’ తో దర్శకుడిగా విజయ్ ఆంటోని..

Bichagadu 2

Vijay Antony: విభిన్నమైన చిత్రాలతో అటు తమిళ్, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించిన విజ‌య్ ఆంటోని ‘బిచ్చ‌గాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బ్లాక్‌బస్ట‌ర్ సాధించి తెలుగు ఆడియన్స్ హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు.

Bichagadu 2

జూలై 24న విజయ్ ఆంటోని పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘బిచ్చ‌గాడు 2’ టైటిల్ లుక్ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురగదాస్ రిలీజ్ చేశారు. కాళికాదేవి ఉగ్రరూపంతో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌లో, విజయ్ భార్య ఫాతిమా సమర్పణలో తమిళంలో ‘పిచ్చైకారన్’, తెలుగులో ‘బిచ్చగాడు2’ రూపొందుతున్న ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్ర‌హీత ప్రియా కృష్ణ‌స్వామి డైరెక్ట్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఇప్పుడు ఆయన బదులు విజయ్ ఆంటోనినే దర్శకత్వ భాధ్యత్యలు నిర్వర్తించబోతున్నానని తెలిపారు. యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా అలరించిన విజయ్ ఈ సినిమాతో డైరెక్టర్‌గానూ ఆకట్టుకోబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘బిచ్చగాడు 2’ మూవీని 2022లో విడుదల చెయ్యనున్నారు.