Vijay Antony: షూటింగ్‌లో ప్రమాదం తర్వాత విజయ్ ఆంటోని తొలి ట్వీట్.. ఇప్పుడెలా ఉన్నాడంటే

మలేసియాలో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. బోట్లలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా, బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని మలేసియాలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న విజయ్ కుటుంబ సభ్యులు మలేసియా చేరుకున్నారు.

Vijay Antony: షూటింగ్‌లో ప్రమాదం తర్వాత విజయ్ ఆంటోని తొలి ట్వీట్.. ఇప్పుడెలా ఉన్నాడంటే

Vijay Antony: ‘బిచ్చగాడు-2’ చిత్ర షూటింగ్‌లో తమిళ హీరో విజయ్ ఆంటోని గాయపడ్డ సంగతి తెలిసిందే. మలేసియాలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. బోట్లలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా, బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు.

Pawan Kalyan : కొండగట్టులో ‘వారాహి’కి జనసేనాని పూజలు..

వెంటనే అతడ్ని మలేసియాలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న విజయ్ కుటుంబ సభ్యులు మలేసియా చేరుకున్నారు. విషమ పరిస్థితిలో ఉన్న విజయ్‌ను కుటుంబ సభ్యులు చెన్నై తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని, అతడు కోమాలో ఉన్నాడని కూడా ప్రచారం జరిగింది. విజయ్ ముఖానికి గాయాలై, దంతాలు కూడా ఊడిపోయాయని మరో ప్రచారం జరిగింది. దీంతో విజయ్ అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర వేదనకు గురయ్యారు. విజయ్ ఆంటోని కోలుకోవాలని ప్రార్థించారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ఆంటోని స్పందించాడు.

Pawan Kalyan: తెలంగాణలో పోటీకి సిద్ధం.. బీజేపీతోనే జనసేన దోస్తీ: పవన్ కల్యాణ్

మంగళవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా తన ఆరోగ్య పరిస్థితిపై ఒక ప్రకటన చేశాడు. ‘‘ప్రియమైన మిత్రులారా.. మలేసియాలో ‘పిచైకారన్-2’ (బిచ్చగాడు-2) షూటింగ్‌లో దవడ, ముక్కుకు గాయాలుకాగా, వాటికి సంబంధించి సర్జరీ పూర్తైంది. ఈ సర్జరీ నుంచి సురక్షితంగా కోలుకున్నా. ఇప్పుడే ఒక పెద్ద సర్జరీ పూర్తైంది. వీలైనంత త్వరగా మీతో మాట్లాడాలి. నా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించినందుకు, సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు’’ అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశాడు. 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు-2’ను విజయ్ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తూనే, నిర్మిస్తున్నాడు.