Vijaya Raghavan: రానా చేతుల మీదుగా విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ట్రైలర్!

బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఆ సినిమా తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నాడు. త్వరలోనే విజయ రాఘవన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Vijaya Raghavan: రానా చేతుల మీదుగా విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ట్రైలర్!

Vijaya Raghavan

Vijaya Raghavan: బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఆ సినిమా తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నాడు. త్వరలోనే విజయ రాఘవన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

కాగా.. సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఆగష్టు 2 సోమవారం సాయంత్రం 5:01 గంటలకు విజయ రాఘవన్ ట్రైలర్‌ రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో ఆత్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచగా ట్రైలర్ పై ఆసక్తి నెలకొంది. విజయ్ ఆంటోనీ కథల ఎంపికపై ఇండస్ట్రీలో పాజిటివిటీ ఉండగా రానా సపోర్ట్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తుంది. విజయ్ ఆంటోనీ ‘విజయ రాఘవన్’తో పాటు మరో నాలుగు సినిమాలను కూడా లైన్లో పెట్టగా ప్రస్తుతం రెండు సినిమాలు ముమ్మర షూటింగ్ లో ఉన్నాయి.