Kushi : విజయ్ అండ్ సమంత బ్యాక్ టు ‘ఖుషి’ సెట్స్.. శివ నిర్వాణ ట్వీట్!
సమంత ఆరోగ్య పరిస్థితి కారణంగా గత కొంత కాలంగా 'ఖుషి' మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకపోవడం, మూవీ మేకర్స్ కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఈ చిత్రం ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా..

Kushi : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్టు మూవీ టైటిల్ ని పెట్టుకున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ తోనే అంచనాలు క్రియేట్ చేసింది. నిన్ను కోరి, మజిలీ వంటి సెన్సిటివ్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు వేరు వేరు మనస్తత్వాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే, వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది. గత ఏడాది ఏప్రిల్ లో మొదలైన ఈ మూవీ షూటింగ్ దాదాపు సగం పైగా పూర్తి చేసుకుంది.
Vijay Devarakonda : వాలీబాల్ టీం ఓనర్‌గా లైగర్..
సమంత ఆరోగ్య పరిస్థితి కారణంగా గత కొంత కాలంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకపోవడం, మూవీ మేకర్స్ కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఈ చిత్రం ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా సమంత ఆరోగ్యం మెరుగవడంతో ఆమె మళ్ళీ షూటింగ్స్ పాల్గొంటుంది. కానీ ఖుషి షూటింగ్ లో కాకుండా హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్ లో పాల్గొనడంతో..ఖుషి మూవీ నిజంగా ఆగిపోయిందా? అనే వార్తలకు బలం చేకూర్చాయి. నిజం ఏంటో తెలియక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దీంతో దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చాడు.
ఖుషి రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. అంతా అనుకున్నట్లు వస్తుంది అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూసిన విజయ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలయ్యి, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది తెలియజేయలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ హృదయం సినిమాకి సంగీతం అందించిన హేశం అబ్దుల్ వహాబ్ ఈ మూవీకి పని చేస్తున్నాడు.
#khushi regular shoot will start very soon ?
everything is going to be beautiful❤️— Shiva Nirvana (@ShivaNirvana) January 30, 2023