Vijay Devarakonda : నా బర్త్ డే అందరికి సెంటిమెంట్ అయిపోయింది.. |Vijay Devarakonda Birthday Special Tweet

Vijay Devarakonda : నా బర్త్ డే అందరికి సెంటిమెంట్ అయిపోయింది..

విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా లైగర్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. మే 9న సాయంత్రం నాలుగు గంటలకు లైగర్ కు సంబంధించిన ఒక స్పెషల్ థీమ్ ను.........

Vijay Devarakonda : నా బర్త్ డే అందరికి సెంటిమెంట్ అయిపోయింది..

Vijay Devarakonda :  విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతోబిజిగా ఉన్నాడు. త్వరలో లైగర్ సినిమాతో రాబోతున్నాడు. మరోవైపు జనగణమన, శివనిర్వాణ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇవాళ (మే 9న) విజయ్ దేవరకొండ బర్త్ డే. ఇప్పటికే పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విజయ్ కి స్పెషల్ విషెష్ చెప్తున్నారు. ఇక సమంత అర్ధరాత్రే విజయ్ తో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ చేసింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా లైగర్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. మే 9న సాయంత్రం నాలుగు గంటలకు లైగర్ కు సంబంధించిన ఒక స్పెషల్ థీమ్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇదే రోజు F3, మేజర్, అంటే సుందరానికి, బాలీవుడ్ సినిమా పృద్విరాజ్ సినిమాల నుంచి కూడా అప్డేట్స్ ఉన్నాయి. ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ కానున్నాయి. దీంతో విజయ్ నా బర్త్ డే అందరికి సెంటిమెంట్ అయిపోయింది అంటూ ఓ ట్వీట్ చేశాడు.

Vijay : 2023 సంక్రాంతి.. చరణ్ అవుట్.. విజయ్ ఇన్..

ఈ ట్వీట్ లో.. ”నా పుట్టిన రోజున చాలా సినిమాల ప్రమోషన్స్ ఉన్నాయి. ఇది పండగ రోజు. అందరికి విజయ్ దేవరకొండ బర్త్ డే సెంటిమెంట్ ఎక్కువైపోయింది. అంతా మంచే జరుగుతుంది. నా పవర్ కూడా షేర్ చేస్తాను” అంటూ పోస్ట్ చేశాడు. F3, మేజర్, అంటే సుందరానికి, పృద్విరాజ్ సినిమాలని హ్యాష్ ట్యాగ్ తో జత చేశాడు ఈ ట్వీట్ కి. ఇలా సరదాగా ట్వీట్ చేసేసరికి ఇది వైరల్ గా మారింది.

×