Liger: ‘అక్డీ పక్డీ’ ఫుల్ సాంగ్ రిలీజ్.. రెచ్చిపోయిన లైగర్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను టార్గెట్....

Liger: ‘అక్డీ పక్డీ’ ఫుల్ సాంగ్ రిలీజ్.. రెచ్చిపోయిన లైగర్!

Vijay Devarakonda Energetic Dance In Akdi Pakdi Full Song In Liger

Liger: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేశాడు ఈ రౌడీ స్టార్. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ

ఇక ఇటీవల ఈ సినిమా నుండి ‘అక్డీ పక్డీ’ అంటూ ఓ ఎనర్జిటిక్ డ్యాన్స్ పార్టీ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన పూర్తి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో ఈ పాటను చూసిన ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ పాట ఔట్ అండ్ ఔట్ డ్యాన్స్ నంబర్‌గా ఉండటం.. ఈ పాటలో విజయ్ దేవరకొండ అదిరిపోయే ఫాస్ట్ బీట్ స్టెప్పులతో రెచ్చిపోవడంతో ఆయన ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. ‘‘మావోడు ఈరేంజ్‌లో డ్యాన్స్ చేస్తాడా…’’ అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు స్టన్ అవుతున్నారు.

Liger: ‘అక్డీ పక్డీ’ అంటూ ఊరమాస్‌గా రెచ్చిపోయిన లైగర్

యూట్యూబ్‌లో ఈ పాటను రిలీజ్ చేసిన కొద్దిసేపటికే నేషన్ వైడ్‌గా ఈ పాట వైరల్ అయ్యింది. ఇక అందాల భామ అనన్యా పాండే కూడా ఈ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు వేసింది. మొత్తానికి ఈ పాటతో విజయ్ దేవరకొండ తనలోని డ్యాన్స్ స్కిల్స్ కూడా చూపెట్టాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.