Vijay Devarakonda : పులికి పాలు పట్టించి.. సింహం, పాములతో ఆడుకుంటున్న రౌడీ హీరో..

తాజాగా విజయ్ దేవరకొండ దుబాయ్ లోని ఓ జంతువుల పార్క్ కి వెళ్లిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దుబాయ్ లో ఫేమ్ పార్క్ అనే ఓ జంతువుల పార్క్..............

Vijay Devarakonda : పులికి పాలు పట్టించి.. సింహం, పాములతో ఆడుకుంటున్న రౌడీ హీరో..

Vijay Devarakonda enjoying with wild animels in fame park at Dubai

Vijay Devarakonda :  విజయ్ దేవరకొండ గత సంవత్సరం లైగర్ సినిమాతో భారీ పరాజయం చూశాడు. కొన్ని నెలలు సైలెంట్ గా ఉన్న విజయ్ మళ్ళీ ఇప్పుఇప్పుడే సోషల్ మీడియాలో యాక్టీవ్ అవుతూ సినిమాలని కూడా ప్రకటిస్తున్నాడు. త్వరలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. అలాగే గౌతమ్ తిన్ననూరి, పరుశురాం లతో సినిమాలు ప్రకటించాడు విజయ్.

ప్రస్తుతం రష్మికతో కలిసి దుబాయ్ కి వెకేషన్ కి వెళ్ళాడు ఈ రౌడీ హీరో. ఇటీవల రష్మిక, విజయ్ దేవరకొండ దుబాయ్ వీధుల్లో తిరిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. తాజాగా విజయ్ దేవరకొండ దుబాయ్ లోని ఓ జంతువుల పార్క్ కి వెళ్లిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దుబాయ్ లో ఫేమ్ పార్క్ అనే ఓ జంతువుల పార్క్ ఉంది. ఇక్కడ పులులు, సింహాలు, పాములు.. అనేక క్రూర జంతువులు కూడా ఉంటాయి. కానీ అవన్నీ స్నేహంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి వాటిని మనుషులకి స్నేహంగానే పెంచుతారు. అక్కడికి వెళ్ళినవాళ్ళు వాటితో ఆడుకుంటూ, ఎత్తుకుంటూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు.

Rishab Shetty : మీరు చూసింది కాంతార 2.. ఇప్పుడు కాంతార 1 తీస్తాను.. సర్‌ప్రైజ్ ఇచ్చిన రిషబ్ శెట్టి..

తాజాగా విజయ్ దేవరకొండ అక్కడికి వెళ్లగా.. అక్కడి పాముల్ని తన మెడలో వేసుకొని, పాములతో ఆడుకొని, సింహాలతో గేమ్స్ ఆడి, పులి పిల్లలకు పాలు పట్టించి, పాముల కింద పడుకొని, కొన్ని జంతువులని ఎత్తుకొని, సింహం పిల్లలతో ఆడుకొని, పక్షులకు తినిపించి.. ఇలా అక్కడున్న అన్ని జంతువులతో విజయ్ సరదాగా గడిపిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)