Vijay Devarakonda: యంగ్ సెన్సేషన్‌తో రొమాన్స్‌కు రౌడీ స్టార్ రెడీ..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ‘ఖుషి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Vijay Devarakonda: యంగ్ సెన్సేషన్‌తో రొమాన్స్‌కు రౌడీ స్టార్ రెడీ..?

Vijay Devarakonda Eyes On Sreeleela For His Next Movie

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ‘ఖుషి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Vijay Devarakonda : టూర్‌కి పంపించిన అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన రౌడీ హీరో..

ఈ సినిమా రిలీజ్ కాకముందే, విజయ్ తన నెక్ట్స్ చిత్రాన్ని ‘జెర్సీ’ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్‌ను ఫిక్స్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ యంగ్ సెన్సేషన్‌ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల జోరు మామూలుగా లేదు. వరుసబెట్టి సినిమా ఛాన్సులు కొట్టేస్తూ దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. దీంతో అమ్మడిని తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకునేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నాడట.

Vijay Devarakonda: నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ..?

శ్రీలీల అయితే తమ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని.. అభిమానులకు ఫ్రెష్ పెయిర్‌గా తమ జోడీ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని విజయ్ భావిస్తున్నాడట. దీంతో ఆమెను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ సంప్రదింపులు చేసేందుకు రెడీ అవుతోందట. మరి నిజంగానే ఈ సినిమా ఆఫర్ శ్రీలీలకు వస్తే, ఆమె ఈ సినిమాను ఓకే చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.